Site icon Prime9

Mallikarjun Kharge: I.N.D.I.A కూటమి చైర్మన్ గా మల్లికార్జున్ ఖర్గే

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge:  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా బ్లాక్‌కు చైర్మన్‌గా శనివారం నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.సీటు షేరింగ్ ఎజెండా, “భారత్ జోడో న్యాయ్ యాత్ర”లో పాల్గొనడం మరియు కూటమికి సంబంధించిన ఇతర విషయాలను సమీక్షించడానికి ఇండియా బ్లాక్ నాయకులు వర్చువల్ మీటింగ్‌ను ఈరోజు నిర్వహించారు.

కన్వీనర్ పదవిని రిజెక్ట్ చేసిన  నితీశ్ కుమార్..(Mallikarjun Kharge)

ఇలా ఉండగా నితీష్‌ కుమార్‌ను మహాకూటమి కన్వీనర్‌గా నియమిస్తూ సమావేశానికి హాజరైన నేతలు కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే, నితీష్ కుమార్ పార్టీ మాత్రం ఆయన ఏ పదవి కోసం వెంపర్లాడలేదని తెలిపింది. ఆయన ఈ ప్రతిపాదనను తిరస్కరించారని, కాంగ్రెస్ నుండి ఎవరైనా బాధ్యత వహించాలని చెప్పారని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సమావేశానికి హాజరు కాని ఇతర పార్టీల నేతలతో చర్చించిన తర్వాత కన్వీనర్ పదవిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో మమతా బెనర్జీ ఖర్గేను కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు.

శుక్రవారం, ఖర్గే అధ్యక్షతన పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ లోక్‌సభ సమన్వయకర్తల సమావేశాన్ని నిర్వహించి, ప్రజలతో తమ అనుబంధాన్ని పెంచుకోవాలని కోరారు.మొదటి సమావేశం గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవా, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూలకు నిర్వహించగా, రెండవ సమావేశం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కోఆర్డినేటర్లకు జరిగింది. తరువాత చండీగఢ్, జమ్మూ-కాశ్మీర్ మరియు లడఖ్ లతో నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది.

Exit mobile version