Site icon Prime9

INS Vikrant: ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

INS Vikrant

INS Vikrant Features: ప్రధాని మోదీ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ-నిర్మిత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను శుక్రవారం ప్రారంభించారు. దేశ నావికా బలాన్ని పెంచడానికి సిద్ధంగా ఉంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ యుద్ధనౌకను “కదిలే నగరం”గా అభివర్ణించారు.

1.ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్‌లో నిర్మించిప అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్. ఇది 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో ఉంది. రష్యా ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య తర్వాత ఇది దేశం యొక్క రెండవ విమాన వాహక నౌక.
2. ఈ నౌక రెండు ఫుట్‌బాల్ ఫీల్డ్‌ల అంత పెద్దది మరియు 18 అంతస్తుల ఎత్తులో ఉందని నేవీ ఒక వీడియోలో తెలిపింది.
3. విమాన వాహక నౌక యొక్క హ్యాంగర్ రెండు ఒలింపిక్-కొలనుల వలె పెద్దది .ఈ యుద్ధనౌకలో మిగ్ యుద్ధ విమానాలు, కొన్ని హెలికాప్టర్లు ఉంటాయి. ఇది నేవీ ఏవియేషన్ ట్రయల్స్ నిర్వహిస్తుంది.
4. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో 1,600 మంది సిబ్బంది మరియు 30 విమానాలు ఉన్నాయి. గంటకు 3,000 చపాతీలు తయారు చేయగల యంత్రాలు ఉన్నాయి.
5. ఈ యుద్ధనౌకలో 16 పడకల ఆసుపత్రి, 250 ట్యాంకర్ల ఇంధనం మరియు 2,400 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

Exit mobile version