Mahua Moitra: లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.లోక్‌సభ హౌసింగ్ కమిటీ ఆమెను తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమని కోరే ప్రక్రియను ప్రారంభించాలని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
30 రోజుల వ్యవధిలో..(Mahua Moitra)
ఎంపీ మొయిత్రాకు మంత్రిత్వ శాఖ ప్రత్యేక కోటా కింద ఇంటిని కేటాయించింది. నియమాల ప్రకారం, అనర్హుడైన పార్లమెంటేరియన్ ప్రభుత్వ వసతికి అర్హులు కాదు. ఈ నేపధ్యంలో అధికారిక బంగ్లాను ఖాళీ చేయడానికి 30 రోజుల వ్యవధి ఇవ్వబడుతుంది.సదరు ఎంపీ ఈ వ్యవధిలో అన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయవలసి ఉంటుంది. కొద్ది కాలం కిందట రాహుల్ గాంధీ కూడా ఈ విధంగా తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. మహువా మొయిత్రాపై వచ్చిన ‘క్యాష్ ఫర్ క్వెరీ’ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను అనుసరించి శుక్రవారం లోక్‌సభ నుండి బహిష్కరించబడ్డారు. అయితే మహువా మొయిత్రా ఎథిక్స్ కమిటీ తనకు వ్యతిరేకంగా ఆధారాలు నిరూపించలేకపోయిందని అన్నారు. ఎథిక్స్ కమిటీ ప్రతి నియమాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడంపై మహువా మోయిత్రా డిసెంబర్ 11న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.