Site icon Prime9

Shiv Sena: శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి షాక్.. అసలైన శివసేన షిండేదే అన్న స్పీకర్‌

Shiv Sena

Shiv Sena

Shiv Sena:  శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి మహారాష్ట్రలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారంనాడు స్పష్టం చేశారు. శివసేన నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన కి లేదని తేల్చిచెప్పారు. శివసేన పార్టీకి చీఫ్‌గా ఉద్ధవ్ థాకరేను కొనసాగించాలంటూ ఆ వర్గం నేతలు ఇచ్చిన ఫిర్యాదును తోసిపుచ్చారు. పార్టీకి చీఫ్‌గా సీఎం ఏక్‌నాథ్ షిండేను అడ్డుకోలేమని నార్వేకర్ స్పష్టమైన తీర్పునిచ్చారు.

 చీలిక  తరువాత ..(Sena vs Sena)

ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనపై 2022 జూన్‌లో షిండే, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో శివసేనలో చీలిక తలెత్తింది. షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఉద్ధవ్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. షిండే ముఖ్యమంత్రిగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షిండే సహా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని థాకరే వర్గం స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా, తమదే నిజమైన శివసేన అంటూ థాకరే వర్గంపై వేటు వేయాలని షిండే వర్గం సైతం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే షిండే శివసేనను అసలైన శివసేనగా ఎన్నికల సంఘం ప్రకటించి, ఆ వర్గానికే పార్టీ గుర్తును కూడా కేటాయించింది.

Exit mobile version