Site icon Prime9

Exit Polls 2024: ఈవీఎంలో ఓటరు తీర్పు.. ఎన్డేయే హవా ఖాయమంటున్న ఎగ్జిట్ పోల్స్

Maharashtra, Jharkhand Exit Poll Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 వరకు మహారాష్ట్రలో 58.22శాతం, ఝార్ఖండ్‌లో 67.59 శాతం పోలింగ్‌ నమోదైంది. క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.

ఓటేసిన రాజకీయ, సినీ ప్రముఖులు
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నేతలతోపాటు సినీ, వ్యాపార, క్రీడారంగాలకు చెందిన పలువురు కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిరా గుర్తు చూపుతూ అందరూ ఓటేసేందుకు ముందుకు రావాలంటూ పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహించగా, ఝార్ఖండ్‌ లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప న్నికలు నిర్వహించారు. ఈ నెల 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఎన్డీయే హవాయేనా?
మహరాష్ట్ర, జార్ఖండ్‌ పోలింగ్ సమయం ముగిసిన వెంటనే పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రజల ముందుకు తెచ్చాయి. వీటిలో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి విజయం ఖాయమని వారు లెక్కలతో సహా చెబుతున్నారు. పీపుల్స్ పల్స్ సంస్థ లెక్కల ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ 182, కాంగ్రెస్‌ 97,ఇతరులు 9 సీట్లు రానుండగా, జార్ఖండ్‌లో ఎన్డీయేకి 46-58, జేఎంఎం కూటమి 24-37, ఇతరులు 6-10 సీట్లు రానున్నాయని తేల్చింది. ఇక ఏబీపీ, రిపబ్లిక్, చాణక్య సంస్థల సర్వేలూ ఇదే బాటలో సాగాయి.

ఇదీ లెక్క..
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్ నంబరు 145. ఇక్కడ మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేయగా, విపక్ష ఎంవీఏలోని కాంగ్రెస్‌ 101, శివసేన 95, ఎన్సీపీ 86 సీట్లలో పోటీ చేశాయి. బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి. అటు జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలుండగా, మెజార్టీ మార్కు 41. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్‌విలాస్‌) పార్టీ ఒకచోట పోటీ చేశాయి. విపక్ష కూటమి తరఫున జేఎంఎం 43, కాంగ్రెస్‌ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్‌) నాలుగు చోట్ల పోటీ చేశాయి.

Exit mobile version