Site icon Prime9

CRZ violations: రూ.200 కోట్ల రిసార్టును కూల్చేస్తున్నారు.. ఎందుకో తెలుసా..

7-star-Resort-In-Kerala

Kerala: కేరళ ప్రభుత్వం సోమవారం నాడు, కపికో కేరళ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. దీనిద్వారా అలప్పుజలో రూ. 200 కోట్ల విలువైన సెవెన్ స్టార్ రిసార్ట్ కూల్చివేతకు రంగం సిద్దమయింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సిఆర్ జెడ్ ) నిబంధనలను ఉల్లంఘించినందుకు జిల్లాయంత్రాంగం ఈ రిసార్టును కూల్చివేయాలని నిర్ణయించింది.

వెంబనాడ్ సరస్సు యొక్క బ్యాక్ వాటర్‌లోని ఒక ద్వీపంలో ఉన్న హై-ఎండ్ టూరిస్ట్ రిసార్ట్‌ను కూల్చివేయాలని 2020లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 36,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ రిసార్ట్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.రిసార్ట్ గ్రూప్ ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకున్న అలప్పుజ జిల్లా కలెక్టర్ కృష్ణ తేజ, కూల్చివేతపై యాజమాన్యం స్థానిక పంచాయతీకి కార్యాచరణ ప్రణాళికను సమర్పిస్తామని చెప్పారు. జిల్లా యంత్రాంగం దీనికి తుది ఆమోదం తెలిపిన తర్వాత వారం రోజుల్లో కూల్చివేత ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి చెత్తను సురక్షితమైన పద్ధతిలో పారవేయాలని ఆయన అన్నారు.ఏడు హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు పానవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. 54 విల్లాలతో కూడిన రిసార్ట్ నిర్మాణం 2007లో ప్రారంభమై 2012లో పూర్తయింది. దీని అంచనా విలువ సుమారుగా రూ.200 కోట్లు. అయితే ఈ ప్రాజెక్ట్ భూమి ఆక్రమణ మరియు సిఆర్ జెడ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొన్నందున, రిసార్ట్ యాజమాన్యం దాన్ని తెరవలేకపోయింది.

కేరళ హైకోర్టు గతంలో 2013లో దీనిని కూల్చివేయాలని ఆదేశించింది. యాజమాన్యం సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పటికీ, పెట్టుబడిదారులకు ఎటువంటి ఉపశమనం లభించలేదు.2020లో, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు కేరళలోని కొచ్చిలోని వెంబనాడ్ బ్యాక్‌వాటర్‌కు సమీపంలో ఉన్న నాలుగు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను కూల్చివేశారు.

Exit mobile version