Threat to CM Yogi: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు కాల్‌కు సంబంధించి లక్నో పోలీసులు మంగళవారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రియురాలి తండ్రిపై విసుగు చెందిన ఓ ప్రేమికుడు చేసిన పనేనని ఇప్పుడు తేలింది.యూపీ 112, దాని వాట్సాప్ గ్రూప్‌లో యూపీ సీఎంకు ప్రాణహాని ఉందంటూ కాల్, మెసేజ్ రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
దొంగిలించిన ఫోన్ తో కాల్ చేసి.. (Threat to CM Yogi)
కాల్‌ను ట్రేస్ చేసిన తర్వాత, లక్నో పోలీసులు ఫోన్ నంబర్ యజమానిని సంప్రదించారు.అతను తన ఫోన్ రెండు రోజుల క్రితం దొంగిలించబడిందని చెప్పాడు. ఆ తర్వాత అమీన్ అనే వ్యక్తి తన ప్రియురాలి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించేందుకు పథకం పన్నాడని పొరుగు వారు పోలీసులకు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 18 ఏళ్ల అమీన్ తన స్నేహితురాలి తండ్రితో గొడవ పడ్డాడు. ఎందుకంటే అతను వారి సంబంధంతో సంతోషంగా లేడు. దీనితో ఆవేశంలో తన ప్రియురాలి తండ్రి సజ్జాద్ హుస్సేన్ ఫోన్‌ను దొంగిలించి, దాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రిని చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.నిందితుడిపై ఫోన్ దొంగతనంతో పాటు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం లక్నో కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
త్వరలో సిఎం యోగిని చంపేస్తాను అని అమీన్ ఉత్తరప్రదేశ్ పోలీసులకు పంపిన సందేశం అందుకున్న వెంటనే, పోలీసులు ADG, లా అండ్ ఆర్డర్ మరియు ADG ఇంటెలిజెన్స్ సహా సీనియర్ అధికారులకు సమాచారం అందించారు. ఉత్తరప్రదేశ్ లో ఇటీవలి కాలంలో నేరస్తులను ఎన్ కౌంటర్ చేయడం, వారి ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం జరగడంతో సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు పలు బెదిరింపులు వచ్చాయి.