NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు జితేంద్ర అవద్ బుధవారం రాముడు ‘మాంసాహారి’ అంటూ చేసిన వ్యాఖ్యలతో వివాదం రేగింది.అతని ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడి వైరల్ గా మారింది.మరోవైపు బీజేపీ అవద్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. అతనిపై ఫిర్యాదు చేసింది.
అడవిలో శాఖాహారం ఎలా ?..( NCP)
మహారాష్ట్రలోని షిర్డిలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్సీపీ శరద్ పవార్ శిబిరానికి చెందినఅవద్ ఈ వ్యాఖ్య చేశారు.“రాముడు బహుజనులమైన మనకు చెందినవాడు. అతను జంతువులను వేటాడి తినేవాడు. అతను బహుజనుడు. వారు శ్రీరాముని ఉదాహరణగా చూపుతూ ప్రతి ఒక్కరినీ శాఖాహారులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ శ్రీరాముడు శాఖాహారి కాదు అతను మాంసాహారి. 14 సంవత్సరాలుగా అడవిలో ఉన్న వ్యక్తి శాఖాహారం కోసం ఎక్కడికి వెళ్తాడు? అని అవద్ అన్నారు.ఎన్‌సిపి అజిత్ పవార్ వర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో మద్దతుదారులు బుధవారం అవద్ ఇంటి వెలుపల ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులు అవద్ యొక్క పోస్టర్ ను పదేపదే చెప్పులతో కొట్టారు. దీనితో అవద్ ఇంటి ముందు పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ నేతృత్వంలో నిరసనకారులు సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎన్‌సీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.”రాముడి భక్తులందరూ జితేంద్ర అవద్‌పై పోలీసు కేసు వేస్తారని కదమ్ చెప్పారు.