Lok Sabha Elections 2024 : నాలుగవ విడత లోకసభ ఎన్నికల ఓటింగ్ క్రమంగా జోరుందుకుంటోంది. మొత్తం తొమ్మిది రాష్ర్టాల్లో ఒక కేంద్ర ప్రాలిత ప్రాంతంతో సహా మొత్తం 96 నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటల వరకు చూస్తే ఓటింగ్ 24.87 శాతంగా నమోదైందని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 32.78 శాతం ఓట్లు పోల్ కాగా.. జమ్ము కశ్మీర్‌లో అత్యల్పంగా 14.94 శాతం పోలింగ్ నమోదైంది. ఇక రాష్ర్టాలవారీగా చూస్తే మధ్యప్రదేశ్‌లో 32.38 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 23.10 శాతం, బిహార్ 22.54 శాతం, జార్ఖండ్‌లో 27.40 శాతం, ఒడిషాలో 23.28 శాతం, మహారాష్ర్టలో 17.51 శాతం, తెలంగాణలో 24.31 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 27.12 శాతంగా నమోదైంది. దేశంలోని 96 పార్లమెంటు నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఒడిషాలో అసెంబ్లీతో పాటు లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా సోమవారం నాడు ఒడిషాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక మొత్తం 96 లోకసభ నియోకవర్గాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాలు, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలు, మహారాష్ర్టలో 11, మధ్యప్రదేశ్‌లో 8, పశ్చియ బెంగాల్‌లో ఎనిమది, జమ్ము కశ్మీర్‌లో ఒకటి చొప్పున లోకసభ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. అయితే మొత్తం 96 లోకసభ నియోజకవర్గాలకు గాను 4,264 నామినేషన్లు వచ్చాయి. అయితే పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ప్రముఖ నాయకుల విషయానికి వస్తే.. ఎంఐఎం చీఫ్ అసుదద్దీన ఓవైసీ, సమాజ్‌వాదీ నుంచి అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ నుంచి అధీర్ రంజన్ చౌదరి, టీఎంసీ నుంచి మహువా మొయిత్రా, బీజేపీ నుంచి గిరిరాజ్ సింగ్, జెడియు నుంచి రాజీవ్‌రంజన్ సింగ్, టీఎంసీ నుంచి శత్రుఘ్న సిన్హా, యుసుఫ్ పటాన్, బీజేపీ నుంచి అర్జున్ ముండా, మాధవి లత, ఏపీలో వైఎస్ షర్మిలలు బరిలో నిలిచారు.