Site icon Prime9

Supreme Court: సుప్రీంలో ప్రారంభం కానున్న ప్రత్యక్ష ప్రసారాలు

Live telecast from Supreme Court in cases

Live telecast from Supreme Court in cases

New Delhi: వచ్చే వారం నుండి సుప్రీం కోర్టులో రాజ్యాంగ ధర్మాసనం కేసులతో ప్రత్యక్ష ప్రసారాలు చేసేందకు సర్వం సిద్దం చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

పూర్వపు సీజెఐ ఎన్వీ రమణ ప్రత్యక్ష ప్రసారాల పై ప్రత్యేక చొరవ తీసుకొని లైవ్ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేసి తొలి అడుగు వేశారు. అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టులో చేపట్టే వాస్తవాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో తాజా నిర్ణయం ఎంతో కీలకమైంది. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో గతంలో ఏర్పాటు చేసిన సాధ్యాసాధనాల కమిటి కూడా సానుకూలంగా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.

వాస్తవానికి తొలుత రాజ్యాంగ ధర్మాసనం కేసులను ప్రత్యక్ష ప్రసారాలతో వాదనలు ప్రారంభమౌతాయి. అనంతరం ఏ కేసుల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేయనున్నారో సుప్రీం కోర్టు ప్రత్యేకంగా తెలియచేసే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version