Site icon Prime9

Liquor Sales : లిక్కర్ ధమాకా… ఢిల్లీలో వారం రోజుల్లో రూ.218 కోట్ల లిక్కర్ అమ్మకాలు

DELHI

DELHI

Liquor Sales : న్యూ ఇయర్‌కు ముందు వారంలో ఢిల్లీలో రోజువారీ మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.డిసెంబర్ 24 నుండి 31 వరకు వారం రోజుల వేడుకల మధ్య ఢిల్లీలో రూ.218 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.

డిసెంబర్ 31న అత్యధికంగా రూ.45.28 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.సాధారణ రోజుల్లో దాదాపు 11 నుంచి 12.5 లక్షల సీసాలు అమ్ముడవుతాయని, అయితే డిసెంబర్ 24 నుంచి 31 వరకు పండుగ వారంలో ఎక్కువగా విస్కీతో కూడిన మొత్తం 1.10 కోట్ల మద్యం సీసాలు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.డిసెంబరు 24న నగరంలో మొత్తం రూ.28.8 కోట్ల విలువైన 14.7 లక్షల సీసాలు అమ్ముడయ్యాయని, డిసెంబరు 27న రాజధానిలో రూ.19.3 కోట్ల విలువైన 11 లక్షల కంటే తక్కువ మద్యం బాటిళ్లు అమ్ముడయ్యాయని ఆయన తెలిపారు.

డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాల ద్వారా ఢిల్లీ ప్రభుత్వం రూ.560 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.గత ఏడాది జూలైలో, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22పై సీబీఐ విచారణకు ఆదేశించారు. దీనితో ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ఉపసంహరించుకోవడంతో పాత మద్యం పాలసీని మరోసారి అమల్లోకి తెచ్చింది.

Exit mobile version