Site icon Prime9

LIC chairman: ఎల్ఐసీ నూతన ఛైర్మన్ గా సిద్ధార్థ మొహంతి

LIC chairman

LIC chairman

LIC chairman: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC)కు కొత్త ఛైర్మన్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీ నూతన ఛైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని నియమించింది. సిద్ధార్థ మొహంతి ప్రస్తుతం ఎల్‌ఐసీ ఎండీ, తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. సిద్ధార్థ కు జూన్ 7, 2025 కు 62 ఏళ్లు నిండుతాయి. అప్పటి వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఎల్‌ఐసీ మాజీ ఎండీ బి.సి. పట్నాయక్‌ను బీమా నియంత్రణ ప్రాథికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సభ్యుడిగా నియమించారు.

 

నూతన ఛైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి(LIC chairman)

ఐఆర్‌డీఏఐ సభ్యుడిగా బి.సి. పట్నాయక్‌ కూడా 62 ఏళ్ల వయసు వరకు బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులు, డైరెక్టర్ల పదవులకు ఎంపికలు జరిపే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బ్యూరో మొహంతిని ఎల్‌ఐసీ ఛైర్మన్‌గా సిఫారసు చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని నియామకాల మంత్రివర్గ సంఘం అనుమతి ఇచ్చిన తర్వాత ఈ రెండు నియామకాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ ఏడాది మార్చి 13న ఎమ్‌ఆర్‌ కుమార్‌ పదవీ కాలం పూర్తి అయింది. ఇక అప్పటి నుంచి మొహంతియే ఎల్‌ఐసీ తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2021లో ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవీకాలాన్ని 62 ఏళ్లకు సవరించారు. ప్రస్తుతం మొహింతి వయసు 60 ఏళ్లు.

Exit mobile version