Site icon Prime9

Vokkaliga Seer Comments: సిద్దరామయ్య దిగిపోయి డీకే శివకుమార్ సీఎం అవ్వాలి.. ఒక్కలిగ మఠం పీఠాదిపతి కామెంట్స్

Vokkaliga Seer Comments

Vokkaliga Seer Comments

 Vokkaliga Seer Comments: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌కు అవకాశాం ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వొక్కలిగ మఠం పీఠాదిపతి చంద్రశేఖర స్వామిజీ అభ్యర్థించారు. ఒక కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్యతో వేదిక పంచుకున్న సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. అందరూ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారాన్ని అనుభవించారు. కానీ మా డీకే శివకుమార్ ఇంకా ముఖ్యమంత్రి కాలేదు, సిద్ధరామయ్య ఇప్పటికైనా శివకుమార్‌కు దారి చూపాలని ఆయన అన్నారు.

హైకమాండ్ దే తుది నిర్ణయం..( Vokkaliga Seer Comments)

చంద్రశేఖర స్వామీజీ వ్యాఖ్యలతో కర్ణాటక సీఎం పదవిపై మరోసారి వదంతులు చెలరేగాయి. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి పంచుకునేలా సిద్దరామయ్య, డీకే ల మధ్య ఒప్పందం కుదిరిందన్నది వాటిలో ఒకటి. మరోవైపు ఈ పుకార్లపై డీకే శివకుమార్ స్పందిస్తూ, పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయం అని అన్నారు.గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, సిఎం పదవి కోసం సిద్ధరామయ్య మరియు డికె శివకుమార్ పోటీ పడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యను సీఎం పదవికి ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ గా పేరు పొంది పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన శివకుమార్ డిప్యూటీ సీఎంగా సర్దుకుపోవలసి వచ్చింది.

Exit mobile version