Site icon Prime9

NEET Results: NEET ఫలితాలకు చట్టపరమైన సవాళ్లు

NEET Results

NEET Results

NEET Results: నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ (NEET UG) 2024 ఫలితాలు తీవ్ర వివాదంగా మారాయి. నీట్‌ పరీక్షలు మొదలైన తర్వాత నుంచి పలు వివాదాలు చుట్టుముట్టాయి. వాటిలో పేపర్‌ లీక్‌ కావడం ఒక ఎత్తైతే.. ఇష్టం వచ్చినట్లు మార్కులు ఇచ్చారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.

కోర్టుకు చేరిన  ఫలితాల వివాదం..(NEET Results)

ఈ ఏడాది మొత్తం 67 మంది క్యాండిడెట్లు AIR ర్యాంకు 1 సాధించారు. ఒక సెంటర్‌లో ఎనిమిది మంది విద్యార్థులు ఈ స్థాయిలో మార్కులు సాధించారు. ఫలితాలు చూసిన తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మార్కుల అవకతకలపై కోర్టుకు ఎక్కారు. కొంత మంది విద్యార్థులకు కావాలని ప్రయోజనం కలిగించారు. నీట్‌ ఫలితాలు మొత్తం అవకతలు జరిగాయని వారు ఆరోపించారు.తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న విద్యార్థులు సుప్రీంకోర్టు కెక్కారు. వెంటనే మెడికల్‌ఎంట్రెన్స్‌ టెస్ట్‌ పరీక్షల రీ వ్యాల్యూయేషన్‌ చేయించాలని కోరారు. కాగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్‌ చేసిన విద్యార్ధి విషయానికి వస్తే శివాంగి మిశ్రాతో పాటు పలువురు ఉన్నారు. వారి ప్రధాన ఆరోపణ విషయానికి వస్తే NEET పరీక్షలు అన్నీ నిబంధనలకు విరుద్దంగా నిర్వహించారు. ఆర్టికల్‌ 14 ప్రకారం రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించింది. కొంత మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరిస్తే కష్టపడి చదివిన విద్యార్థలు నష్టపోతారని వారు వాదిస్తున్నారు.ఇదిలా ఉండగా ఢిల్లీ హైకోర్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను నీట్‌ -యుజీ క్యాండిడెట్‌ లేవనెత్తిన ప్రశ్నలపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించింది. ఒక ప్రశ్నకు రెండు కరెక్ట్‌ జవాబులున్నట్లు అన్సర్‌ కీలో ఉంది. అయితే ఓ ప్రశ్నకు జవాబు రాస్తే రెండు మార్కులు ఇవ్వాల్సి ఉంటే అధికారులు మాత్రం ఒక్కమార్కే ఇచ్చారని విద్యార్థి పిటిషన్‌ పేర్కొన్నాడు. దీని గురించి కోర్టు అధికారులను వివరణ అడిగింది.

ఎన్‌సీఈఆర్‌టి పుస్తకంతో మరో వివాదం..

ఇక ఎన్‌సీఈఆర్‌టి పుస్తకంతోను వివాదమే…. ఇదిలా ఉండగా నీట్‌ యూజీ 2024 పరీక్షలో సుమారు 44 మంది టాప్‌ స్కోర్‌ సాధించారు.. బేసిక్‌ ఫిజిక్‌ ప్రశ్నకు ఎన్‌సీఈఆర్‌టి పాత వెర్షన్‌ పుస్తకాన్ని బట్టి జవాబు రాశారు. ఇది కాస్తా తప్పు జవాబుగా తేలింది. సుమారు 13,000 మంది విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టి పుస్తకాన్ని బట్టి జవాబు రాశారు. మే 29, 2024 విడుదల చేసిన కీలో ఇది తప్పుగా తేలింది. అయితే చాలా మంది విద్యార్థులు దీనికి జవాబు రాస్తే నెగెటివ్‌ మార్కు వస్తుందని భయపడి దాన్ని వదిలేశారు. అయితే ఎన్‌టీఏ జవాబు రాసిన వారికి రాయని వారికి అందరికి కలిపి మార్కులు వేసింది. ఎన్‌సీఈఆర్‌టి పుస్తకంలో దొర్లిన తప్పుల వల్ల విద్యార్థులను శిక్షించరాదని నిర్ణయించింది. అయితే ఎన్‌సీఈఆర్‌టి 12వ తరగతి పాత వెర్షన్‌ ద్వారా కొంత మంది విద్యార్తులు అదనపు మార్కులు దక్కించుకున్నట్లు అయ్యింది.

ఇదిలా ఉండగా నీట్‌ పరీక్షల్లో తప్పులు దొర్లినందున ఒక కమిటిని ఏర్పాటు చేసి నివేదిక వచ్చిన తర్వాత ఎడ్యూకేషన్‌ మినిస్ర్టీ రెండవ సారి పరీక్ష నిర్వహించాలా వద్దా అని తుది నిర్ణయం తీసుకుంటుంది. కాగా 23 లక్షల మంది విద్యార్థులు నీట్‌ పరీక్షలు రాశారు. కాగా ఆరు సెంటర్లకు చెందిన 1,600 మంది విద్యార్థులు మాత్రం నీట్‌ పరీక్షల్లో జరిగిన అవకతవకల వల్ల నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు

Exit mobile version