Site icon Prime9

Bank Holidays : జూన్‌ నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు సెలవు.. ఎప్పుడెప్పుడంటే ?

latest news about bank holidays in june month in 2023

latest news about bank holidays in june month in 2023

Bank Holidays : సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రతి నెల సెలవులు రావడం సాధారణమే. ఈ మేరకు మే నెల ముగియనుండడంతో.. జూన్ నెలలో ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఉండే సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఇక తాజాగా విడుదల చేసిన దానిని గమనిస్తే.. జూన్‌ నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయని తెలుస్తుంది. బ్యాంకు లావాదేవీలకు వెళ్లేవారు ఈ తేదీలను బట్టి ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌.

జూన్​ నెలలో బ్యాంక్​ సెలవుల వివరాలు (Bank Holidays)..

జూన్​ 4 –  ఆదివారం

జూన్​ 10 –  రెండో శనివారం

జూన్​ 11 –  ఆదివారం

జూన్​ 15 –   రాజ సంక్రాంతి. మిజోరాం, ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు (Bank Holidays).

జూన్​ 18 – ఆదివారం

జూన్​ 20 – రథ యాత్ర. ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.

జూన్​ 24 – నాలుగో శనివారం

జూన్​ 25 – ఆదివారం

జూన్​ 26 – ఖార్చి పూజ, త్రిపురలో బ్యాంక్​లకు సెలవు (Bank Holidays).

జూన్​ 28 – ఈద్​ ఇల్​ అజ్వా. కేరళ, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.

జూన్​ 29 – ఈద్​ ఇల్​ అజ్వా, ఇతర రాష్ట్రాల్లోని బ్యాంక్​లకు సెలవు ఉండొచ్చు.

జూన్​ 30 – రీమా ఈద్​ ఇల్​ అజ్వా, మిజోరాం- ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.

అయితే బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను (Bank Holidays) ఉపయోగించుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ, క్యాష్ డిపాజిట్ మెషిన్లతో నగదు జమ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

Exit mobile version