Prime9

Covid- 19: కరోనా @ 6133.. దేశవ్యాప్తంగా భారీగా కేసుల నమోదు

Corona Virus: దేశంలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకు పాజిటీవ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో ఈ ఏడాది కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య ఆరు వేలను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిస్తోంది. కరోనా జాగ్రత్తలను పక్కాగా అమలు చేయాలని ఆదేశిస్తోంది. మరోవైపు తాజాగా నమోదవుతున్న కరోనా వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్తోంది.

 

తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,131 పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో ఈ ఏడాది యాక్టీవ్ కేసుల సంఖ్య 6,133 కి చేరింది. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు మరణించారు. ఇక తాజాగా నమోదైన కేసులతో కలిపి కేరళలో 1950 కేసులు బయటపడ్డాయి. గుజరాత్ 822, వెస్ట్ బెంగాల్ 693, మహారాష్ట్ర 595, కర్ణాటక 366 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar