Site icon Prime9

Bihar: అధికారిక సమావేశంలో మంత్రిగారి బావగారు..

Patna: బావమరిది మంత్రిగా ఉన్నాడు. మంత్రి అంటే సమావేశాలు సాధారణమే కదా. అలాగే అతను కూడ ఈ సమావేశం నిర్వహించాడు. అయితే ఈ సమావేశానికి అతని బావ హాజరయ్యాడు. ఉన్నతాధికారుల సమావేశానికి హాజరయిన అతడికి ఎటువంటి అధికారిక పదవి లేదు. ఇది బీహార్ లో జరిగింది. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఏర్పాటు చేసిన అధికారిక సమావేశానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు శైలేష్ కుమార్ హాజరయ్యారు. యాదవ్ ప్రస్తుతం నితీష్ కుమార్ నేతృత్వంలోని మంత్రివర్గంలో అటవీ, పర్యావరణం మరియు వాతావరణ మార్పుల శాఖల మంత్రిగా ఉన్నారు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మిసా భారతి భర్త అయిన కుమార్ కూడా ఈ సమావేశంలో సీనియర్ అధికారులు పాల్గొనడం పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కాలుష్య సమస్య పరిష్కారానికి కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశ చిత్రాలను చూపిస్తూ, బీహార్ బిజెపి అధికార ప్రతినిధి మరియు పార్టీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్, బీహార్ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను తేలికగా తీసుకోవద్దు. మా సోదరుడు శైలేష్ కూడా అతనితో కూర్చున్నాడు. శైలేష్ జీ ఆశీస్సులు ఉంటే తేజ్ ప్రతాప్ యాదవ్ ఉత్తమ మంత్రిగా నిరూపించబడతాడని సెటైర్లు వేసారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల జోక్యం పై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆర్జేడీ 15 ఏళ్ల అధికారంలో ఉన్న సమయంలో, రబ్రీ దేవి సోదరులు సాధు మరియు సుభాష్ యాదవ్ లు ఇలాగే వ్యవహరించేవారు. తాజాగా శైలేష్‌కుమార్‌కు ఎలాంటి అధికారిక పదవి లేకపోవడంతో మంత్రి సమావేశానికి ఎందుకు హాజరయ్యారనే విషయం పై స్పష్టత రాలేదు.

Exit mobile version
Skip to toolbar