Site icon Prime9

KL Sharma: అమెధీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కెఎల్‌ శర్మ నామినేషన్‌!

KL Sharma

KL Sharma

KL Sharma: అమెధీ ,రాయబరేలి నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అమెధీ నుంచి రాహుల్‌ పోటీ చేయాల్సి ఉండగా.. ఆయన తల్లి నియోజకవర్గం అయిన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే అమెధీ నుంచి కాంగ్రెస్‌పార్టీకి అత్యంత నమ్మకస్తుడు కెఎల్‌ శర్మను పోటీకి నిలబెట్టింది. గత 40 సంవత్సరాల నుంచి ఆయన పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నాడు. అమెధీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. పార్టీ కార్యకర్తలు భజంతో భుజం కలిపి కిశోరీ లాల్‌ విజయానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా కెఎల్‌ శర్మ నామినేషన్‌ ఫైల్‌ చేశారు.

ప్రియాంకా గాంధీ మద్దతు..(KL Sharma)

ప్రియాంకా గాంధీ అమెధీ వచ్చి కెఎల్‌ శర్మకు మద్దతు తెలిపారు. పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపడానికి ప్రయత్నించారు. రాయబరేలీలో తన సోదరుడు రాహుల్‌ గాంధీ నామినేషన్‌ ఫైల్‌ చేస్తున్న క్రమంలో తాను రాయబరేలీ వెళ్లాల్సి వస్తోందన్నారు. కిశోర్‌ లాల్‌ శర్మ విజయానికి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి తాను ఇక్కడే మకాం వేస్తానని… పోలింగ్‌ ముగిసే వరకు ఇక్కడే ఉంటానని అన్నారు. బీజేపీ డబ్బుతో గెలవాలనుకుంటోంది.. తాము ప్రజల మద్దతుతో గెలవాలనుకుంటున్నామని ఆమె అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాము రాజకీయాల్లో వచ్చామన్నారు ప్రియాంకా.

ఇదిలా ఉండగా రాహుల్‌ అమెధీ నుంచి పలాయనం చిత్తగించాడని స్మృతి ఇరానీ ఎద్దేశా చేశారు. ఓటింగ్‌కు ముందే కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని అంగీకరించిందన్నారు. ప్రతిపక్ష పార్టీ రాహుల్‌ బదులుగా రాహుల్‌ ప్రతినిధి కిశోరి లాల్‌ శర్మను పోటీకి దింపిందన్నారు. ఖచ్చితంగా ఓడిపోతామనే ఉద్దేశంతో రాహుల్‌ రాయబరేలీకి పారిపోయాడని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. రాయబరేలీ నుంచి రాహుల్‌ పోటీ చేస్తున్నాడంటే ఇది అమెధీ ప్రజల విజయమని ఆమె వ్యాఖ్యానించారు. కాగా 2019లో స్మృతి చేతిలో రాహుల్‌ సుమారు 55వేల ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఇక్కడి నుంచి పోటీ చేయాలంటే ఆయన జంకుతున్నాడన్న టాక్‌ ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తోంది. గాంధీ కుటుంబం అమెధీకి 50 ఏళ్లలో చేయలేనిది బీజేపీ కేవలం ఐదు సంవత్సరాల్లో చేసే చూపించిందన్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.

Exit mobile version