Mani Shankar Aiyar:అయోధ్యలో రామమందిరం ప్రారంభాన్ని ఖండిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్‌ను ఢిల్లీలోని జంగ్‌పురాలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ( ఆర్ డబ్ల్యుఎ) తన ఇంటి నుండి బయటకు వెళ్లమని కోరింది.
మరొక కాలనీకి వెళ్లండి..( Mani Shankar Aiyar)
ఆలయ ప్రాణప్రతిష్టకు నిరసనగా, ముస్లిం పౌరులకు సంఘీభావం తెలుపుతూహిందూ మతం- జాతీయవాదం పేరుతో ఆమె చేసిన చర్యలను నిరసిస్తూ సరణ్య అయ్యర్ జనవరి 20 నుండి 23 వరకు మూడు రోజుల నిరాహార దీక్ష చేసిన తర్వాత ఈ నోటీసు జారీ అయింది.అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించడాన్ని వ్యతిరేకించే మీరు అలాంటి ద్వేషాన్ని కళ్లకు కట్టే విధంగా మరొక కాలనీకి వెళ్లాలని మేము మీకు సూచిస్తున్నామని ఆర్ డబ్ల్యుఎ పేర్కొంది.సురణ్య అయ్యర్ చర్యలు మరియు ప్రకటనలు సమాజంలో శాంతి మరియు సామరస్యానికి భంగం కలిగిస్తాయని. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని ఆందోళన చెందుతున్న నివాసితులు తమను సంప్రదించారని తెలిపింది. మణిశంకర్ అయ్యర్‌ను తన కుమార్తె చర్యలను ఖండించవలసిందిగా అభ్యర్థించింది.ఇది కాలనీకి,మొత్తం సమాజానికి మంచిది కాదని పేర్కొంది.
మరోవైపు సురణ్య అయ్యర్ ఫేస్‌బుక్ వీడియోలో ఆర్ డబ్ల్యుఎ కి తాను నివసించే కాలనీతో సంబంధం లేదని పేర్కొంది. తన సోషల్ మీడియా ప్రకటనలకు మించి ఈ విషయంపై బహిరంగంగా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు, అభిప్రాయాలను రూపొందించే ముందు ఆమె పూర్తి వీడియోను చూడాలని ప్రజలను కోరారు.