Site icon Prime9

Karnataka Sex Scandal Case: కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసు.. ఎంపీ ప్రజ్వల్ పై గ్లోబల్ లుక్ అవుట్ నోటీసు జారీ

MP Prajwal

MP Prajwal

 Karnataka Sex Scandal Case:కర్ణాటక సెక్స్‌ టేప్‌ల కేసు మరింత జటిలం అవుతోంది. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ్‌ మనవడు పలువురు మహిళలో జరిపిన రాసలీల టేపు ప్రస్తుతం కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. గత నెల 26న లోకసభ ఎన్నికల పోలింగ్‌ మగిసిన వెంటనే ప్రజ్వల్‌ దేశం విడిచి జర్మనీ పారిపోయాడు. కాగా ఆయనపై గ్లోబల్‌ లుక్‌ అవుట్‌నోటీసు జారీ చేయాలనే డిమాండ్‌ ఊపందుకుంది. కాగా ఈ సెక్స్‌ టేపుల వ్యవహారం వెలుగుచూసిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిటి్‌)ను ఏర్పాటు చేశారు. తాజాగా గురువారం నాడు ఆయనకు వ్యతిరేకంగా లుక్‌ఔట్‌ నోటీసు జారీ అయ్యింది. దీంతో ప్రపంచవ్యాప్తగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్‌ పాయింట్ల వద్ద నోటీసులు జారీ చేస్తారు.

జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్..( Karnataka Sex Scandal Case)

ఇక ప్రజ్వల్‌ రేవన్న గత నెల 26న తన డిప్లొమాటిక్‌ పాస్‌పోర్ట్‌ ద్వారా ఫ్రాంక్‌ఫర్ట్‌ పారిపోయాడు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసి.. వెంటనే ప్రజ్వల్‌ రెవన్న డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరారు. ఏప్రిల్‌ 26న కర్నాటకలో పోలింగ్‌ ముగిసిన వెంటనే జర్మనీకి పారిపోయాడు. అంతకు ముందు సోషల్‌ మీడియలో ప్రజ్వల్‌ పలువురు మహిళలతో కామక్రీడల్లో పాల్గొన్న వీడియోలు పెద్ద ఎత్తున హల్‌చల్‌ చేశాయి. ఇక ప్రజ్వల్‌ విషయానికి వస్తే ఆయన మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మనమడు, ఆయన తండ్రి హచ్‌డీ రెవన్న.. ఇక రేవన్న విషయానికి వస్తే ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఒక ప్రజ్వల్‌ హసన్‌ నుంచి లోకసభ సభ్యుడి గెలిచారు. మరోమారు గెలిచి లోకసభలో కాలుమోపాలనుకుంటున్నాడు.

కర్ణాటకలో ప్రజ్వల్‌ సెక్స్‌ టేప్‌లు పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది.. సిట్‌ ముందు హాజరు కావడానికి వారం రోజులు గడువు కోరాడు ప్రజ్వల్‌. కాగా ఆయన తండ్రి హెచ్‌డీ రెవన్నను కూడా సిటి ముందు హాజరు కావాలిని నోటీసుపంపారు. కాగా ప్రజ్వల్‌ విషయానికి వస్తే తాను బెంగళూరులో లేనని చెప్పాడు. ఇదిలా ఉండగా ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి రెవన్నపై హోలేనరసిపూర్‌లో పోలీసు స్టేషన్‌లో వారి ఇంట్లో వంట మనిషిగా పనిచేసిన మహిళ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన కూతురుతో కూడా ప్రజ్వల్‌ వీడియో కాల్‌లో అసభ్యకరంగా మాట్లాడారని పోలీసులకు ఫిర్యాదు చేశారు వంట మనిషి.

Exit mobile version