Site icon Prime9

Man Beheaded Minor Girl: టీనేజీ బాలిక తల నరికిన కాబోయే వరుడు !

karnataka

karnataka

Man Beheaded Minor Girl: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోబోతున్న టీనేజ్‌ అమ్మాయి తలనరికి .. తలను తీసుకొని పారిపోయిన అత్యంత కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… 16 ఏళ్ల మీనా అనే టీనేజ్‌ బాలికను 32 ఏళ్ల వ్యక్తి గురువారం నాడు వివాహం చేసుకోవాల్సింది. అయితే అధికారులు వివాహ వేదిక వద్దకు వచ్చి పెళ్లి నిలిపివేయించారు. అధికారులు కుటుంబసభ్యులతో మాట్లాడి అమ్మాయి అండర్‌ ఏజ్‌… మైనర్‌ కాబట్టి పెళ్లి చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. కాగా ఈ సంఘటన కర్నాటకలోని మడికేరలో చోటు చేసుకుంది. పెళ్లికి ముందు జరగాల్సిన నిశ్చితార్థాన్ని అధికారులు నిలిపివేశారు. దీంతో ఆగ్రహం చెందిన కాబోయే వరుడు ఆగ్రహంతో టీనేజ్‌ బాలిక తల నరికి.. తలను తీసుకొని పారిపోయాడని పోలీసులు చెప్పారు.

మైనర్ వివాహాన్ని అడ్డకున్న  అధికారులు.. (Man Beheaded Minor Girl)

ఇదిలా ఉండగా 32 ఏళ్ల ప్రకాశ్‌ మీనాను గురువారం నాడు పెళ్లి చేసుకోవాల్సింది. అయితే గురువారం నాడు మదికేరేలోని సుర్లాబ్బి గ్రామంలో మీనా పదవ తరగతి పరీక్షలు కూడా రాసింది. అయితే పెళ్లి విషయం గురించి గ్రామంలోని ఎవరో చైల్డ్‌ వెల్పేర్‌ డిపార్టుమెంటుకు సమాచారం అందించారు. చట్ట ప్రకారం ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని, వెంటనే పెళ్లి తంతు ఆపాలని అధికారులు ఆదేశించారు. ఒక వేళ అండర్‌ ఏజ్‌ బాలిక వివాహం జరిపితే చట్టరీత్యా చైల్డ్‌ మ్యారేజీ యాక్డ్‌ (పోస్కో ) కింద అరెస్టు చేయాల్సి వచ్చిందని హెచ్చరించారు. ఇరు కుటుంబాలకు అధికారులు కౌన్సలింగ్‌ ఇచ్చారు. ఇరు కుటుంబాలు పెళ్లి వాయిదా వేసుకోడానికి అంగీకరించారు. మీనాకు 18 ఏళ్ల వయసు వచ్చినప్పడు పెళ్లి చేస్తామని అధికారులకు హామీ కూడా ఇచ్చారు.

ఈ తంతు జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రకాశ్‌ బాలిక ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ముందుగా బాలిక తల్లిదండ్రులపై దాడి చేశాడు. బాలిక తండ్రిని తన్ని తల్లిపై కత్తితో దాడి చేశాడు. అటు తర్వాత బాలికను సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లి అక్కడ మీనా తల నరికి .. తలను తీసుకొని పరుగెత్తిపోయాడు. అప్పటి నుంచి ప్రకాశ్‌ ఆచూకీ తెలియకుండాపోయింది. పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేస్తామని కొందుర్గు పోలీస సూపరింటెండెంట్‌ రామరాజన్‌ మీడియాకు చెప్పారు. కాగా ప్రకాశ్‌పై పోలీసులు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 307, 302 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version
Skip to toolbar