Prime9

Kamal Kaur : కారులో ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్‌ కౌర్‌ మృతదేహం.. రంగంలోకి పోలీసులు

Social Media Influencer Kamal Kaur : పంజాబ్‌లో దారుణం వెలుగు చూసింది. లూధియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి అదేష్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్కింగ్ చేసిన కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కమల్ కౌర్‌ను వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

పార్కింగ్ చేసిన కారు నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు లోపల కౌర్ మృతదేహాన్ని గుర్తించారు. కారు లూధియానా జిల్లాలో రిజిస్ట్రర్‌ అయినట్లు సమాచారం. కౌర్‌కు సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.83 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె చేసే రీల్స్ ఎంతో ఆదరణ పొందాయి. ఆమె అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

 

ప్రాథమికంగా ఆమెది హత్యకేసుగా పరిగణిస్తున్నామని బఠిండా పోలీస్ సూపరింటెండెంట్ అమ్నీత్ కొండల్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. నిందితులు కౌర్‌ను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ స్థలంలోని కారులో ఉంచారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar