Site icon Prime9

Kamal Haasan Controversy: వివాదంలో కమల్ హాసన్.. రాజ్యసభకు ఎంట్రీ

kamal hasan

kamal hasan

Kamal Haasan Controversy Comments on Kannada Language: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సహకారంతో ఆయన రాజ్యసభకు ఎన్నికవ్వనున్నారు. కాగా కమల్ హాసన్ ను పెద్దల సభకు పంపనున్నట్టు మక్కల్ నీది మయ్యుం ప్రకటన విడుదల చేసింది. అందుకు బలం చేకూరుస్తూ డీఎంకే కూడా ప్రకటన చేసింది. అయితే అధికార డీఎంకే, మక్కల్ నీది మయ్యుం పార్టీ కమల్ హాసన్ మధ్య గతంలో రాజకీయ ఒప్పందం కుదిరిందని సమాచారం. దీని ప్రకారం తాజాగా రెండు పార్టీలు ప్రకటన విడుదల చేశాయి.

 

మరోవైపు నటుడు కమల్ హాసన్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలతో కన్నడ నాట తీవ్ర దుమారం లేపాయి. తాను నటించిన థగ్ లైఫ్ సినిమా ఆడియో విడుదల సందర్భంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని పేర్కొన్నారు. నటుడు శివరాజ్ కుమార్ మరో రాష్ట్రంలో నివసిస్తున్న నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదులుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది. మీరు భాగస్వామి అయ్యారు”. అని శివరాజ్ కుమార్ ను ఉద్దేశించి మాట్లాడారు. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ హాసన్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్ లైఫ్ సినిమా బ్యానర్లను ఆందోళనకారులు చింపివేశారు. కర్నాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడను అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar