Site icon Prime9

Kamal Haasan : పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ కి సపోర్ట్ చేసిన కమల్ హాసన్‌.. యువకుడిపై దాడి చేస్తున్నారంటూ !

kamal haasan indirectly supports udayanidhi stalin in sanathana dharmam issue

kamal haasan indirectly supports udayanidhi stalin in sanathana dharmam issue

Kamal Haasan : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం గురించి ఇటీవల చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేషన్ వైడ్ గా కూడా పలువురు ఆయనకు మద్దతుగా నిలిస్తే పలువురు వ్యతిరేకించారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మొత్తం 14 మందికి నోటీసులిచ్చింది. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు స్టాలిన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ని విచారించిన సుప్రీంకోర్టు ఆ మేరకు నోటీసులు అందించింది. వారితో పాటు తమిళనాడు పోలీసులు, సీబీఐ, తమిళనాడు ప్రభుత్వానికి కూడా నోటీసులు అందాయి. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ప్రకాష్ రాజ్, పలువురు నటులు ఇప్పటికే స్టాలిన్ కి మద్దతుగా నిలవగా.. తాజాగా ఆయనకు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్‌ (Kamal Haasan) కూడా పరోక్షంగా మద్దతు ఇచ్చారు.  కోయంబత్తూర్‌లో పార్టీ మీటింగ్‌కి హాజరైన ఆయన సనాతన ధర్మం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం ‘సనాతనం’ అనే పదం వాడినందుకు ఇవాళ ఓ యువకుడు మీద దాడి చేస్తున్నారు. ఈ వివాదం కొత్తేమీ కాదని.. ద్రవిడ ఉద్యమం సిద్ధాంతమే ఇది అని తేల్చి చెప్పారు. ద్రవిడ ఉద్యమం నుంచి వచ్చిన నేతలందరికీ సనాతన ధర్మంపై ఇలాంటి అభిప్రాయమే ఉంటుందని వివరించారు. ఉదయనిధి తాతయ్య డీఎమ్‌కే అధినేత ఎమ్ కరుణానిధి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని వెల్లడించారన్నారు.

పెరియార్ వి రామస్వామి ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతోనే అసహనానికి గురై ఉద్యమించారని చెప్పారు. సనాతన ధర్మం అంటే ఏంటో అందరికీ అర్థమైంది కేవలం పెరియార్ వల్లే అని స్పష్టం చేశారు. పెరియార్ ఓ ఆలయంలో పని చేశారని, కాశీలో పూజలు కూడా చేశారని చెప్పిన కమల్ హాసన్.. అక్కడి పరిస్థితులను చూసిన తరవాతే తన జీవితం మొత్తాన్ని ద్రవిడ ఉద్యమానికి అంకితం చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా పెరియార్‌ని తమ వాడే అని చెప్పుకోడానికి లేదని, ఆయన ప్రజల మనిషే అని స్పష్టం చేశారు.

Exit mobile version