Jyotiraditya Scindia: కేంద్రమంత్రి జ్యోతిర్యాధిత్య సింధియాకు మాతృవియోగం

కేంద్ర పౌర విమానయానశాఖమంత్రి జ్యోతిర్యాధిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఉదయం 9.28 గంటలకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కన్ను మూశారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. ఆమె గత మూడు నెలల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా జల్‌ విలాస్‌ ప్యాలెస్‌ అధికారులు మాత్రం గురువారం నాడు ఆమె అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - May 15, 2024 / 06:56 PM IST

Jyotiraditya Scindia:కేంద్ర పౌర విమానయానశాఖమంత్రి జ్యోతిర్యాధిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఉదయం 9.28 గంటలకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కన్ను మూశారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. ఆమె గత మూడు నెలల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా జల్‌ విలాస్‌ ప్యాలెస్‌ అధికారులు మాత్రం గురువారం నాడు ఆమె అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు.

విద్య, వైద్య రంగాల్లో.. (Jyotiraditya Scindia)

ఇదిలా ఉండగా మాధవి రాజే సింధియా విషయానికి వస్తే ఆమె నేపాల్‌ రాచకుటుంబంలో జన్మించారు. 1966లో ఆమె వివాహం మాధవరావు సింధియాతో జరిగింది. కాగా ఆమె తాతగారు జుద్దా షంషేర్‌ నేపాల్‌ ప్రధానమంత్రిగా 1932 నుంచి 1945 వరకు పనిచేశారు. ఇక మాధవిరాజే సింధియా విషయానికి వస్తే పలు ధార్మిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసేవారు. ముఖ్యంగా ఆమె విద్య, హెల్త్‌కేర్‌ రంగాల్లో సేవలందించారు. ఆమె మృతి పట్ల భారతీయ జనతాపార్టీతో పాటు కాంగ్రెస్‌ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, ప్రముఖలు తీవ్ర సంతాపం తెలిపారు.