ITR Filing Date Extended to September 15: టాక్స్ పేయర్లకు ఆదాయపు పన్నుశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును పొడిగించింది. అంతకుముందు 2025 జులై 31 వరకు ఇచ్చిన గడువును సెప్టెంబర్ 15 వరకు పన్ను చెల్లించేందుకు ఛాన్స్ ఇచ్చింది. కాగా, 2024-25 ఫైనాన్సియల్ ఈయర్‌కు సంబంధించి మరోసారి అవకాశం కల్పించింది. అలాగే ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్‌లో మార్పుల కారణంగా సీబీడీటీ ఆదాయపు పన్ను రిటర్నుల దాఖల గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గడువు పొడిగించడంతో పన్ను చెల్లింపుదారులకు మరో మూడు నెలలు అవకాశం దొరికింది. ఐటీఆర్ ఫారమ్‌లలో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు వస్తున్న ఫిర్యాదులను సులువుగా పరిష్కరించడం, టాక్స్ దారులకు పారదర్శకత పెంచడం, ఫ్యాక్ట్ వివరాలు అందించేలా ప్రోత్సాహం వంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సిస్టమ్ డెవలప్ మెంట్, ఇంటిగ్రేషన్, యుటిలిటీ పరీక్ష వంటి కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
2025, మే 31 వరకు టీడీఎస్ స్టేట్ మెంట్స్ నుంచి రానున్న క్రెడిట్స్ ఈ నెల తొలి వారంలోనే కనిపించనున్నట్లు భావిస్తున్నారు. ఒకవేళ కనిపించని యెడల రిటర్న్‌లు చేసేందుకు సమయం ఉండదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని టాక్స్ ప్లేయర్లకు కచ్చితంగా ఫైలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఐటీఆర్ గడువును పొడిగించేందుకు సీబీడీటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.