Israel-Hamas conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: టెల్ అవీవ్ కు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

ఎయిర్ ఇండియా ప్రయాణికులు మరియు దాని సిబ్బంది సభ్యుల భద్రత దృష్ట్యా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌ కు బయలుదేరే, అక్కడనుంచి వచ్చే విమానాలను నిలిపివేసినట్లు ఆదివారం ప్రకటించింది. ఈ సమయంలో ఏదైనా విమానంలో బుకింగ్‌ చేసుకున్న ప్రయాణీకులకు సహాయపడతామని ఎయిర్ ఇండియా తెలిపింది

  • Written By:
  • Publish Date - October 8, 2023 / 07:49 PM IST

Israel-Hamas conflict:ఎయిర్ ఇండియా ప్రయాణికులు మరియు దాని సిబ్బంది సభ్యుల భద్రత దృష్ట్యా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌ కు బయలుదేరే, అక్కడనుంచి వచ్చే విమానాలను నిలిపివేసినట్లు ఆదివారం ప్రకటించింది. ఈ సమయంలో ఏదైనా విమానంలో బుకింగ్‌ చేసుకున్న ప్రయాణీకులకు సహాయపడతామని ఎయిర్ ఇండియా తెలిపింది.

అక్టోబర్ 14 వరకూ..(Israel-Hamas conflict)

మా ప్రయాణీకులు మరియు సిబ్బంది భద్రత కోసం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు మరియు అక్కడనుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానాలు అక్టోబర్ 14 వరకు నిలిపివేయబడతాయి. ఈ కాలంలో ఏదైనా విమానంలో బుకింగ్‌లను ధృవీకరించిన ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తుంది అని ఎయిర్‌ఇండియా తెలిపింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం మరియు పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య కాల్పులు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన 24 గంటల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం మరియు హమాస్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ రెండింటిమధ్య ఘర్షణల కారణంగా ఇరువైపులా 600 మందికి పైగా మరణించారు.