Site icon Prime9

ఎమ్మెల్సీ కవిత : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఇరుక్కున్నట్లేనా? .. సీబీఐ చార్జిషీటులో వివరాలివే..

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిందితురాలేనని సీబీఐ స్పష్టం చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి పదివేల పేజీల చార్జిషీటును సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఈ ఆధారాలను కోర్టు సమర్దించింది. చార్జిషీటు ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా.. అక్రమంగా ఆర్జించేలా ఆప్‌ నేతలు లిక్కర్‌ పాలసీని రూపొందించారు. అందులో భాగంగానే సౌత్‌గ్రూప్‌ కంపెనీ నుంచి ఆప్‌ నేతలకు కనీసం రూ.100 కోట్ల ముడుపులు అందాయి. ఈ కంపెనీని నియంత్రిస్తున్న వారిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శరత్‌, మాగుంట, మరికొందరు ఉన్నారు.

మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి ఈ వ్యవహారం నడిపినట్లు సీబీఐ చార్జిషీట్ లో తెలిపింది. అభిషేక్ బోయినపల్లి దాదాపు రూ.30 కోట్ల నగదును హవాలా మార్గంలో తరలించినట్లు చార్జిషీటులో ప్రస్తావించారు. ఆ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌ కు అందజేసినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులను ప్రభావితం చేసేందుకు.. హోల్‌సేల్ దారులకు 12 శాతం లాభాలు వచ్చేలా, అందులో 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారని సీబీఐ చార్జిషీటులో తెలిపింది.హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు రూ.4 కోట్లకుపైగా నగదు అందిందని అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా చార్జిషీట్ లో సీబీఐ తెలిపింది. అంతేకా కుండా గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయిందని స్పష్టం చేసింది. మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ చార్జిషీట్ లో పేర్కొంది. సముచితమైన మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలను కూడా దర్యాప్తు సంస్థలు సేకరించాయని సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది.

సీబీఐ చార్జిషీటును కోర్టు పరిగణనోకి తీసుకోవడంతో విచారణ ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు రావడంతో దీనిపై బీఆర్ఎస్ కూడ ధీటుగా స్పందించే అవకాశముంది.ఈ నేపధ్యంలో మున్ముందు ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Exit mobile version