Site icon Prime9

Ramadan Celebrations : దేశ వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో రంజాన్ ప్రార్ధనలు..

interesting details about ramadan celebrations in telugu states

interesting details about ramadan celebrations in telugu states

Ramadan Celebrations : దేశ వ్యాప్తంగా సందడి నెలకొంది. రంజాన్ పర్వదిన వేడుకులును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం పండుగ నిర్వహిస్తున్నారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేపట్టారు. ముస్లింలు ప్రార్థనా మందిరాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. రంజాన్‌ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ముస్లిం సోదరులకు ఏపీ, తెలంగాణ  గవర్నర్‌లు, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌, సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

 

YouTube video player

Exit mobile version
Skip to toolbar