Site icon Prime9

Indore Viral News: ‘మీ షిష్ట్ అయిపోయింది.. ఇక ఇంటికి వెళ్లండి’

Viral News

Viral News

Indore Viral News: ఆఫీస్ లో వర్కింగ్ అవర్స్ పూర్తి అయినా.. పెండింగ్ లో ఉన్న పనుల వల్ల కానీ ఇతర కారణాలతో ఆఫీస్ లోనే ఉండిపోతాము. కొన్ని సార్లు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే ఓవర్ టైం చేయాల్సి వస్తుంది.

అలాంటప్పుడు పర్సనల్ లైఫ్.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతూ ఉంటుంది. దీని వల్ల చాలామంది ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంటారు.

అయితే, మధ్యప్రదేశ్ ఓ ఐటీ కంపెనీ మాత్రం ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన చేసింది.

ఒత్తిడి లేకుండా ఉండేందుకు(Indore Viral News)

ఇండోర్ కు చెందిన సాఫ్ట్ గ్రిడ్ కంప్యూటర్స్ (SoftGrid Computers) అనే సంస్థ ఉద్యోగుల షిఫ్ట్ అయిపోగానే వాళ్లు పనిచేస్తున్న కంప్యూటర్లు ఆగిపోయేలా ఓ సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేసింది.

ఈ పద్దతితో ‘ మీ షిఫ్ట్ టైమ్ అయిపోయింది..10 నిమిషాల్లో సిస్టమ్ ఆగిపోతుంది.

ప్లీజ్ ఇక ఇంటికి వెళ్లండి’ అని ఓ మెసేజ్ సిస్టమ్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది ఉన్నా.. సాఫ్ట్ గ్రిడ్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఈ రూల్ ను ఫాలో అవుతోంది.

ఈ విషయాన్ని ఆ కంపెనీ హెచ్ఆర్ లింక్డ్ ఇన్ లో షేర్ చేశారు. తమ కంపెనీ గంటల తరబడి పని చేయనివ్వదని వెల్లడించారు.

ఈ పద్దతి వల్ల ఉద్యోగులు ఒత్తిడి లేకుండా మరింత ఉత్సాహంతో పని చేస్తారన్నారు.

ప్రమోషన్ కోసం కాదు

ఇది ప్రమోషన్ కోసం చేయడం లేదని.. తమ సంస్థ ఉద్యోగులు వర్క్ లైఫ్ ను, వ్యక్తిగత లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఉద్యోగుల షిఫ్ట్ అవ్వగానే వారి కంప్యూటర్ స్క్రీన్ పై మీ వర్క అవర్స్ ముగిశాయనే మెసేజ్ వస్తుందన్నారు.

10 నిమిషాల తర్వాత వారు సిస్టమ్ ను ఆఫ్ చేయకపోయినా.. అదే ఆటో మేటిక్ లాక్ అవుతుందన్నారు.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమ కంపెనీ లో కూడా ఇలాంటి పద్దతి పెడితే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయం మంచిదని… ఆఫీస్ అయ్యాక కంపెనీకి చెందిన ఎలాంటి కాల్స్, మెయిల్స్ కూడా రావాని మరొకరు కామెంట్ చేశారు.

మొత్తానికి సాఫ్ట్ గ్రిడ్ కంప్యూటర్స్ ఉద్యోగుల కోసం పెట్టిన ఈ రూల్ .. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Exit mobile version