G-20 Summit: జీ-20 సదస్సును కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. వచ్చే నెల 9,10 తేదీల్లో ఈ సదస్సుకు ప్రపంచంలోని సంపన్నదేశాలకు చెందిన ప్రెసిడెంట్లు ఇండియాలో కాలుమోపనున్నారు. వారికి కావాల్సిన వసతితో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సివస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ విషయానికి వస్తే ఆయన దిల్లీలోని ఐటీసీ మౌర్యా షెరటాన్‌లో బస చేస్తే.. చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ మాత్రం తాజ్ ప్యాలెస్‌లో బస చేయబోతున్నారు. దిల్లీలో మొత్తం 23 హోటల్స్, ఎన్‌సీఆర్‌లో తొమ్మిది హోటల్స్ జీ-20 డెలిగేట్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
జో బైడెన్ కు 400 గదులు.. (G-20 Summit)
దిల్లీలోని టాప్ హోటల్స్ ఇలా ఉన్నాయి. ఐటీసీ మౌర్య, తాజ్ మాన్‌సింగ్, తాజ్ ప్యాలెస్, హోటల్ ఒబెరాయ్, హోటల్ లలిత్, ది లోధి, లీ మెరిడియన్, హయత్ రీజెన్సీ, షాంగ్రిలా, లీలా ప్యాలెస్, హోటల్ అశోకా, ఈరోస్ హోటల్, ది సూర్య రాడిసన్ బ్లూ ప్లాజా, జెడబ్ల్యు మారియెట్, షెర్టాన్, ది లాలా అంబియెన్స్ కన్వెన్సన్, హోటల్ పుల్‌మాన్, రోసెట్టి హోటల్, ది ఇంపీరియల్‌లున్నాయి. ఇక ఎన్‌సీఆర్ విషయానికి వస్తే వివాంతా, ఐటీసీ గ్రాండ్, తాజ్ సిటీ, హయత్ రీజెన్సీ, ది ఒబెరాయ్, వెస్ట్ ఇన్, క్రౌన్ ప్లాజాలాంటి హోటల్స్ ఉన్నాయి. ఇక అమెరికన్ సీక్రెట్ సర్వీస్ కమాండోలు ఐటీసీ మౌర్యా హోటల్‌లోని ప్రతి ఫ్లోర్‌లో పహారా కాస్తారు. ఇక జో బైడెన్ విషయానికి వస్తే ఐటిసీ మౌర్యలోని 14వ అంతస్తులో బస చేస్తారు. ప్రతి ఫ్లోర్‌లో ప్రత్యేకంగా ఒక లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. జో బైడెన్‌తో పాటు వస్తున్న మంది మార్బలం కోసం 400 గదులను బుక్ చేశారు.
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆయన షాంగ్రీ లా హోట్‌లో బస చేస్తారు. ఫ్రెంచి ప్రెసిడెంట్ ఎమ్మాన్యూయెల్ మక్రాన్ క్లారిడ్జెస్ హోటల్‌లో బస చేస్తే.. ఆస్ర్టేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్ ఇంపీరియర్ హోటల్‌లో బస చేస్తారు.. చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ మాత్రం తాజ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేయనున్నారు. దిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో టర్కీస్ డెలిగేషన్ బస చేయనుంది. ఇక మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, స్పెయిన్‌కు చెందిన బృందాలు లీ మెరిడియన్‌లు బస చేస్తామని విశ్వసీనయవర్గాల ద్వారా తెలిసింది. ఇక చైనా, బ్రెజిల్‌కు చెందిన డెలిగేషన్స్ దిల్లీలోనితాజ్ ప్యాలెస్‌లో బస చేస్తే…. ఇండోనేషియా, ఆస్ట్రేలియాకు చెందిన డెలిగేషన్స్‌కు ఇంపీరియల్ హోటల్‌లో బస కల్పిస్తున్నారు. ఇక షాంగ్‌రిలా విషయానికి వస్తే బ్రిటన్, జర్మనీకి చెందిన డెలిగేషన్స్‌కు బస కల్పిస్తే.. హయత్ రెజెన్సీ ఢిల్లీ మాత్రం ఇటాలియన్, సింగపూర్ డెలిగేట్స్ వసతి కల్పిస్తోంది. ఇక అమెరికన్ డెలిగేషన్స్ మాత్రం దిల్లీలోని చాణిక్యపూరిలోని ఐటీసీ మౌర్యలో బస చేస్తారు. ఒమాన్‌కు చెందిన డెలిగేట్స్ లోది హోటల్, ఫ్రెంచి డెలిగేట్స్ క్లారిడ్జెస్ హోటల్, బంగ్లాదేశ్‌కు చెందిన డెలిగేట్స్ గ్రాండ్ హయత్ గురుగ్రామ్‌లో బస చేస్తారు. కెనడా, జపాన్‌కు చెందిన వారిని లలిత్ హోటల్ ఢిల్లీలో బస కల్పిస్తారు. కొరియా బృందం విషయానికి వస్తే గురుగ్రామ్‌లోని ఒబెరాయ్ హోటల్‌లో బస చేస్తే,ఈజిప్టుకు చెందిన డెలిగేట్స్ ఐటీసీ షెర్టాన్, సౌదీ అరేబియన్‌కు చెందిన బృందానికి లీలా హోటల్ గురుగ్రామ్ వసతి ఏర్పాటు చేశారు. యూఏఈ డెలిగేట్స్ తాజ్ మహల్ హోటల్ ఢిల్లీలో బస చేస్తారు.
కట్టుదిట్టమైన భద్రత..
ఇక జీ-20 దేశాధినేతలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కోసం సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, ఎన్‌ఎస్‌జీ కమాండోలు దిల్లీ పోలీసు టీంలు విదేశీ అతిథులకు భద్రతను కల్పిస్తాయి. భద్రతా దళాలకు చెందిన కమాండోలకు వివిధ రకాల బాధ్యతలు అప్పగించారు. అమెరికాకు చెందిన అమెరికన్ సీక్రెట్ సర్వీస్ బృందం బైడెన్‌కు భద్రతను కల్పిస్తోంది. జీ-20 సమ్మిట్ ప్రారంభానికి మూడు రోజుల ముందు న్యూఢిల్లీ చేరుకుంటారు. హోంమంత్రిత్వశాఖ ఇప్పటికే విదేశీ అతిథుల భద్రతపై పలు మార్లు చర్చలు జరిపింది. జీ-20 డెలిగేట్స్ కోసం 50 టీంల సీఆర్‌ఎఫ్‌సీ గార్డ్స్ రంగంలోకి దింపింది.