Site icon Prime9

Independence Day 2023 : ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన మోదీ.. ప్రసంగం లైవ్

Independence Day 2023 celebrations live from delhi

Independence Day 2023 celebrations live from delhi

Independence Day 2023 : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో 10 వ సారి మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. కాగా ఈ వేడుకలకు కార్మికులు, రైతులతో పాటు 1800 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు అయ్యారు. ముందుగా మోదీ రాజ్‌ఘాట్ చేరుకొని అక్కడ మహాత్మగాంధీకి గాంధీకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోట వద్ద ఢిల్లీ పోలీసులు, త్రివిధ దళాల గౌరవ వందనంను ప్రధాని మోదీ స్వీకరించారు. ఎర్రకోటలో ప్రధాని మోదీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి అమరనే గిరిధర్ స్వాగతం పలికారు.

ఇక తాజాగా ఉదయం 7.30 గంటలకు ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరవేశారు. మోదీ జెండా ఎగరవేసిన వెంటనే ఆర్మీ హెలికాప్టర్స్‌లో పూల వర్షం కురిపించారు. జాతీయ జెండా ఎగర వేసిన అనంతరం ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌లోనే త్వరలోనే శాంతి నెలకొంటుంది అని చెప్పుకొచ్చారు. దేశమంతా మణిపూర్ వెంటే ఉందని.. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అన్న ప్రధాని.. 140 కోట్ల మంది భారతీయులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

Exit mobile version