Site icon Prime9

Mp MLA: రోడ్డు ప్రమాదాలు పెరగడానికి కారణం రోడ్లు బాగుండడమే- బీజేపీ ఎమ్మెల్యే

mp mla

mp mla

Mp MLA: రోడ్డు ప్రమాదాలపై ఓ భాజపా ఎమ్మెల్యే ఫన్నీ విశ్లేషణ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలకు కారణం.. రోడ్లు బాగుండటమే కారణం అని తెలిపారు. రోడ్లు బాగుంటే.. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఆయన అన్నారు.

రోడ్డు ప్రమాదాలు పెరగడంపై మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్యెల్యే ఈ సమాధానం ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలకు మంచి రోడ్లే కారణం అని తెలిపాడు. రోడ్లు బాగుంటే అధికవేగంగా వాహనాలు వెళ్తాయని.. దాంతో వాహనాలపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందని వ్యాఖ్యనించాడు. రాష్ట్రంలోని రోడ్డు ప్రమాదాలను వివరిస్తూ.. మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కొన్నిసార్లు డ్రైవర్లు మద్యం తాగి వాహనం నడపటం కూడా ప్రమాదానికి కారణం అవుతుందని వివరించాడు.

నారాయణ పటేల్ మధ్యప్రదేశ్ Madya pradesh లోని ఖాండ్వా జిల్లాలోని మంధాన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.. రోడ్లు బాగుండటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషణ ఇచ్చారు.

రోడ్లు సరిగా ఉండటంతో.. వాహనాలు అధికవేగంతో నడుస్తున్నాయి
దానివల్ల వాహనాలపై డ్రైవర్లు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నాడు.

మోతాదుకు మించి డ్రైవర్లు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

ఇలాంటి పరిస్థితిని నేను కూడా అనుభవించానని ఎమ్మెల్యే అన్నారు.

అధ్వాన్నమైన రోడ్లు తక్కువ రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తాయా..? అని అక్కడున్న విలేఖరులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

ఈ ఏడాది ఒక్క ఖాండ్వా జిల్లాలోనే నాలుగు పెద్ద రోడ్డు యాక్సిడెంట్లు జరిగాయి.

2017 అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ రోడ్లు యూఎస్ఏ రోడ్ల కన్నా బాగున్నాయని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫన్నిగా మారింది.

ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version