Ujjain: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సోమవారం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన జరిగింది. 12 ఏళ్ల బాలిక పాక్షిక అర్దనగ్నంగా రక్తస్రావంతో ఇంటింటికి తిరిగి సహాయం కోసం వేడుకుంటే ఒక్కరు కూడా కనికిరించలేదు. సహాయం కోసం ఒక వ్యక్తిని అభ్యర్దిస్తే అతడు తరిమికొట్టాడు.
ఆశ్రమనిర్వాహకుల చొరవతో.. (Ujjain)
బాలిక చివరకు ఒక ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ స్వామీజీ ఆమెకు ఒక టవల్ ఇచ్చి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఆసుపత్రిలో పోలీసు సిబ్బంది ఆమెకు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.బాలికను చికిత్స కోసం ఇండోర్ తరలించారు.ఇండోర్‌లోని మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. అయితే ఆమె ఏమీ చెప్పలేకపోతోందని వైద్యులు తెలిపారు.ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో సరిగ్గా చెప్పలేకపోయింది. కానీ ఆమె ఉచ్ఛారణ ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందినదని సూచిస్తుంది..ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.దోషులను త్వరగా గుర్తించి, పట్టుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయబడింది. మైనర్ యొక్క వైద్య పరీక్షలో అత్యాచారం జరిగినట్లు తెలిసిందని సీనియర్ పోలీసు అధికారి సచిన్ శర్మ తెలిపారు
మైనర్ అత్యాచారంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఉజ్జయిని పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ప్యానెల్ పోలీసులు దాఖలు చేసిన ప్రాథమిక నివేదిక వివరాలను కోరింది మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాలను పాటించాలని వారిని కోరింది.ఎన్‌సిపిసిఆర్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ, ఈ సంఘటనలో అత్యంత దురదృష్టకరం ఏమిటంటే, చాలా గంటలు మైనర్‌కు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇది సమాజంలోని చీకటి కోణాన్ని వెల్లడిస్తోందని అన్నారు.