Site icon Prime9

Ayodhya: అయోధ్యలో ప్రతిష్ఠాపనకు 5 రోజుల ముందు శ్రీరాముని విగ్రహం ఊరేగింపు

Ayodhya

Ayodhya

Ayodhya:జనవరి 22న అయోధ్యలోని ఆలయ ప్రాంగణంలో శ్రీరాముని విగ్రహం యొక్క మహా ప్రతిష్టను నిర్వహించనున్నారు. ఆలయం లోపల శ్రీరాముని విగ్రహాన్ని చూసేందుకు ముందు, అయోధ్య వాసులు ప్రతిష్ఠాపనకు ఐదు రోజుల ముందే  విగ్రహాన్ని చూస్తారు. జనవరి 17న రాముడి విగ్రహాన్ని అయోధ్య చుట్టూ ఉరేగిస్తారు.

వైదిక కార్యక్రమాలతో..(Ayodhya)

సనాతన సంప్రదాయం ప్రకారం, విగ్రహాన్ని ప్రతిష్టించే ముందు దానిని బహిర్గతం చేయకూడదు. కాబట్టి ఈ సమయంలో విగ్రహం యొక్క ముఖం దాచబడుతుంది. దీని తర్వాత అన్ని వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.ఈ పూజను ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్, ఆయన కుమారుడు పండిట్ అరుణ్ దీక్షిత్ మరియు దేశం నలుమూలల నుండి 121 మంది వైదిక బ్రాహ్మణులు నిర్వహిస్తారు.విగ్రహాన్ని రథం లేదా ఇతర తగిన వాహనం ఉపయోగించి రవాణా చేస్తారు. ఆ తర్వాత హవాన్ జరుగుతుంది. ప్రారంభంలో విగ్రహం నీటిలో ముంచుతారు. ఇది శిల్పి విగ్రహంలో మిగిలిపోయిన రంధ్రాలు లేదా లోపాలను ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించడానికి దోహదపడుతుంది. నెయ్యి మరియు తేనెను పగుళ్లను సరిచేయడానికి ఉపయోగిస్తారు. విగ్రహాన్ని ఆవు మూత్రం, ఆవు పేడ మరియు పాలతో పాటు మందులు, పువ్వులు, బెరడులు మరియు ఆకులతో స్నానం చేయిస్తారు. అనంతరం ప్రతిష్టకు రంగం సిద్దమవుతుంది.

Exit mobile version