Site icon Prime9

IAS : వాకింగ్ సరదా ఐఏఎస్ ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.

IAS

IAS

 IAS : ఢిల్లీలో తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేయడానికి క్రీడాకారులను స్టేడియం నుంచి పంపించి వార్తల్లో నిలిచిన ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గాను ప్రభుత్వం బలవంతంగా పదవీ విరమణ చేసినట్లు బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆమెను ప్రభుత్వం తప్పనిసరి పదవీ విరమణ చేసింది.

ఆమె సర్వీస్ రికార్డ్‌ను అంచనా వేసిన తర్వాత, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (CCS) పెన్షన్ రూల్స్, 1972లోని ప్రాథమిక నియమాలు (FR) 56(j), రూల్ 48 ప్రకారం ఆమె తప్పనిసరిగా పదవీ విరమణ పొందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 1994-బ్యాచ్ AGMUT (అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరాం మరియు కేంద్రపాలిత ప్రాంతం) క్యాడర్ అధికారి అయిన దుగ్గా, అరుణాచల్ ప్రదేశ్‌లోని స్వదేశీ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు.  ఆమె తన భర్త సంజీవ్ ఖిర్వార్‌ (ఐఏఎస్ ) ప్రస్తుతం లడఖ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

పెంపుడు కుక్కతో వాకింగ్ చేసి..( IAS )

ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో క్రీడాకారులు రాత్రి ఎనిమిదిగంటల వరకూ ప్రాక్టీసు చేసుకునేవారు. అయితే ఈ జంట నిర్ణీత సమయానికి ముందే క్రీడాకారులను అక్కడనుంచి వెళ్లగొట్టి తమ కుక్కతో వాకింగ్ చేసేవారు. దీనిపై మీడియాలో కధనాలు వచ్చాయి. వారు తమ  వాకింగ్ కోసం  స్టేడియంను ఖాళీ చేయించారని వార్తలు రావడంతో గత సంవత్సరం ఢిల్లీ నుండి వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేయబడ్డారు. తాజాగా రింకూను తప్పనిసరి రిటైర్మెంట్ చేయించారు.

Exit mobile version