Anand Mohan Singh: బీహార్‌లో రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్, త్వరలో జైలు నుండి విడుదల కానున్నారన్న వార్త కలకలం రేపింది, తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని సింగ్ స్పష్టం చేశారు.
15 రోజుల పెరోల్‌పై బయటకు..(Anand Mohan Singh)
తన కుమారుడు ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ వివాహానికి 15 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన సింగ్ స్వేచ్ఛ అందరినీ సంతోషపరుస్తుంది, నేను కూడా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. రాష్ట్రీయ జనతాదళ్ మాజీ ఎంపీ అయిన సింగ్ 1994లో జిల్లా మేజిస్ట్రేట్ జి కృష్ణయ్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో దోషిగా తేలింది. అతనికి 2007లో దిగువ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే పాట్నా హైకోర్టు తర్వాత శిక్షను జీవిత ఖైదుగా మార్చాడంతో 15 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు.నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం జైలు నిబంధనలను సవరించిన తర్వాత విడుదల కానున్న 27 మంది ఖైదీలలో అతను కూడా ఉన్నాడు.
దళిత సమాజంలో ఆగ్రహం..
అయితే నితీష్ కుమార్ చర్యపై బీజేపీ, ఇతర రాజకీయపార్టీలు విమర్శించాయి. ఒక క్రిమినల్ కోసం నిబంధనలను సవరించడం దారుణమని అన్నాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి దీనిని దళిత వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. దీనిపై దళిత సమాజంలో చాలా ఆగ్రహం ఉందని సింగ్ ను విడుదల చేయాలనే నిర్ణయంపై పునరాలోచించాలని ఆమె బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. ఇలా ఉండగా మాయావతి వ్యాఖ్యలపై ఆనంద్ మోహన్ సింగ్ స్పందించారు. నాకు మాయావతి తెలియదు, మీరు ప్రతిసారీ ఎందుకు అడుగుతారు? నేను 15 ఏళ్లుగా జైలులో ఉన్నాను. మాయావతి ఎవరు? అని మీడియాను ఎదురు ప్రశ్నించారు.
శిక్షల ఉపసంహరణ జాబితాలో ఉన్న మొత్తం 27 మంది జైలులో శిక్ష అనుభవించారని ఆయన చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలమేరకే రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆన్నారు.మేము మా శిక్షను అనుభవించాము, జైలుకు కూడా వెళ్ళని కేసులు ఉన్నాయి. వాటని మూసేయడం కూడా జరిగింది. పార్టీలు ముందు వాటి స్వంత ఇంటిని చక్కదిద్దుకోవాలని అన్నారు. బీజేపీలో కూడా చాలామంది నాగురించి ఆలోచించిన వారున్నారని అన్నారు.