Balasore train Accident: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ ( సీఆర్ఎస్ ) నివేదిక తేల్చి చెప్పిందని తెలుస్తోంది. దీనితో ఈ ప్రమాదం వెనుకు ఎటువంటి కుట్ర లేదని స్పష్టమయింది.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదం పై అనుమానాలు వ్యక్తం చేసారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ యొక్క ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉండవచ్చని అన్నారు. అయితే, గత వారం కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ తన నివేదికను రైల్వే బోర్డు ఛైర్మన్‌కు సమర్పించింది. రైలు కార్యకలాపాలకు సంబంధించి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని అనుసరించడం లేదని పేర్కొంది.ఇది ఒక విషాద సంఘటన. నివేదిక మానవ తప్పిదాన్ని సూచించింది. అయితే సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎటువంటి వివరాలను వెల్లడించలేమని ఒక అధికారి తెలిపారు.
జూన్ 2 న, బాలాసోర్ రైలు ప్రమాదంలో 290 మందికి పైగా మరణించారు మరియు 1,000 మందికి పైగా గాయపడ్డారు. రెండు ప్యాసింజర్ రైళ్లతో సహా మూడు రైళ్లు ఢీకొన్న ఈ దుర్ఘటన గత రెండు దశాబ్దాలలో జరిగిన ఘోర రైలు ప్రమాదంగా పరిగణించబడుతుంది.సంఘటన జరిగిన సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి కనీసం ఏడుగురు సీనియర్ మోస్ట్ అధికారులను బదిలీ చేసారు. గత వారం సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్‌ను కూడా బదిలీ చేశారు.