Site icon Prime9

Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇక ఈజీనే

Driving License

Driving License

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ అంటే దళారుల దందా గుర్తుకువస్తుంది . ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనంటే ఆర్టీఓ ఆధ్వర్యంలో ట్రాక్ టెస్టులో పాల్గొనాలి . స్లాట్ బుక్ చేసుకోవాలి ఆర్టీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేయాలి .దింతో వాహన దారులకు చాలా సమయం వృధా అవుతుంది .ఇప్పుడు వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది.

జూన్‌ 1 నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ ప్రక్రియను మరింత సులభ తరం చేస్తూ.. వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే వెసులు బాటు కల్పించింది. నేటి రోజుల్లో కాలేజీ విద్యార్ధి నుంచి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ వాహనాల్ని విరివిరిగా వినియోగిస్తున్నారు. అయితే అందుకు కావాల్సిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ ఇలా వ్యయప్రయాసలు పడాల్సి వస్తుంది . ఈ సమస్యకు పరిష్కార మార్గంగా కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనల్ని కేంద్రం అమల్లోకి తేనుంది.ఇక కేంద్రం విధించిన నిబంధనలకు లోబడి ఉంటే ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనుమతి ఉంది. ఇందుకోసం కేంద్రం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు ఎలా ఉన్నాయంటే

డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు ..(Driving License)

ఈ సదుపాయానికి కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. 4 వీలర్ వాహనాల కోసం డ్రైవింగ్ కేంద్రాలకు అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి. డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తప్పనిసరిగా తగిన పరీక్షా సౌకర్యాన్ని కలిగి ఉండాలి. ట్రైనర్లు కనీసం ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా తత్సమాన విద్యను కలిగి ఉండాలి. కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ట్రైనర్లు బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి.లైట్ వెహికల్ ట్రైనింగ్ తప్పనిసరిగా 4 వారాలలోపు పూర్తి చేయాలి. కనీసం 29 గంటల శిక్షణ ఉంటుంది. భారీ మోటారు వాహనాలకు 38 గంటల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను 6 వారాల్లోగా పూర్తి చేయాలి.అదే విధంగా ఫీజులు కూడా నిర్దారించారు .లెర్నర్ లైసెన్స్: రూ 200 .లెర్నర్ లైసెన్స్ పునరుద్ధరణ: రూ. 200 అంతర్జాతీయ లైసెన్స్: రూ 1000 .శాశ్వత లైసెన్స్: రూ. 200 నిర్ణయించారు

 

Exit mobile version