Site icon Prime9

Gyanvapi Mosque: జ్ఞాన్‌వాపి మసీదు నేలమాళిగలో పూజలకు అనుమతి ఇచ్చిన కోర్టు

Gyanvapi Mosque

Gyanvapi Mosque

Gyanvapi Mosque: వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులను జ్ఞాన్‌వాపి మసీదులో సీలు చేసిన నేలమాళిగలో పూజలకు అనుమతించింది. కోర్టు ఆదేశం ప్రకారం, హిందూ భక్తులు ఇప్పుడు వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు లోపల మూసివున్న ‘వ్యాస్ కా టెఖానా’లో ప్రార్థనలు చేయవచ్చు. అంతకుముందు రోజు విచారణ సందర్భంగా రాబోయే ఏడు రోజుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది.

తీర్పు చారిత్రాత్మకం..(Gyanvapi Mosque)

దీనిపై హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ విలేకరులతో మాట్లాడుతూ’వ్యాస్ కా టెఖానా’లో ప్రార్థనలు చేసేందుకు హిందూ పక్షం అనుమతించింది. జిల్లా యంత్రాంగం 7 రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ పూజలు చేసే హక్కు ఉంటుందన్నారు. 1983లో అయోధ్యలోని రామమందిర తాళాలు తెరవాలని ఆదేశించిన జస్టిస్ కృష్ణమోహన్ పాండే ఇచ్చిన ఉత్తర్వు వలె వారణాసి కోర్టు ఇటీవలి తీర్పును చారిత్రాత్మకంగా భావిస్తున్నాను అని న్యాయవాది విష్ణు జైన్ అన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మసీదు బేస్ మెంట్ కు తాళాలు వేసారు ఇపడు తాజా ఆదేశాలతో వీటిని తొలగించనున్నారు.

Exit mobile version