Site icon Prime9

Ayodhya: అయోధ్యలో హైటెక్ సెక్యూరిటీ ఏర్పాట్లు..

Ayodhya

Ayodhya

Ayodhya:అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న రామమందిరంలో విగ్రహం ప్రాణపతిష్ట వేడుకల నేపధ్యంలో అత్యున్నత స్దాయి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏఐ పవర్డ్ కెమెరాలు , డ్రోన్లు, పెద్ద ఎత్తున పోలీసుబలగాలను మోహరించి అయోధ్యలో భదత్రను పటిష్టం చేశారు.వేడుకలో ప్రతిదానిని నిశితంగా పరిశీలించడానికి, ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం..(Ayodhya)

అయోధ్యలో ప్రతి సంఘటనను నిశితంగా పరిశీలించేందుకు యూపీ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగిస్తున్నారు. ఏఐ డేటా మరియు ఇతర టాప్ సెక్యూరిటీ పరికరాలతో కూడిన యాంటీ మైన్స్ డ్రోన్లను యూపీ పోలీసులు వైమానిక మరియు భూ నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తకుండా చూసేందుకు ఏఐ సీసీటీవీ కెమెరాలను కూడా నగరం అంతటా ఏర్పాటు చేస్తున్నారు ఈ కెమెరాలలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ముఖాలను క్యాప్చర్ చేస్తుంది. భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులను గుర్తించడానికి లేదా సరిపోల్చడానికి వాటిని డేటాబేస్‌లో ఉంచుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. యుపి పోలీసుల యాంటీ టెర్రర్ స్క్వాడ్ హై అలర్ట్‌లో ఉంది. సుమారుగా 100 మంది స్నిపర్లను అయోధ్యలో మోహరించారు. 10 యాంటీ బాలిస్టిక్ వెహికల్స్ నగరాన్ని పర్యవేక్షిస్తాయి.నగరం లోపలి సర్కిల్, సరయూ నది నుండి ఆలయం వరకు ఏటీఎస్ ప్రత్యేక కమాండోలు కాపలాగా ఉంటారు.

జనవరి 21 మరియు 22 తేదీలలో, అతిథులు, పాస్ హోల్డర్లు, అయోధ్య వాహనాలు మినహా అన్ని వాహనాలు అయోధ్యకు వెళ్లే మార్గాల నుండి మళ్లించబడతాయి. జనవరి 18 నుంచి భారీ వాహనాలను దారి మళ్లించాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు అందాయివాహనాలను దారి మళ్లించేందుకు రాష్ట్ర పోలీసులు సమగ్ర ప్రణాళికను రూపొందించారు. అయోధ్య రైల్వే స్టేషన్‌లో రైళ్లు ఆగడాన్ని నిషేధించారు. జనవరి 22న జరిగే ప్రధాన కార్యక్రమానికి రెండు లేదా మూడు రోజుల ముందు బయటి వ్యక్తులను నగరం నుంచి బయటకు పంపుతారు.

Exit mobile version