Civil Aviation Minister Jyotiraditya Scindia: కొత్త జాతీయ రహదారుల వెంట హెలిప్యాడ్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. అత్యవసర సమయంలో ప్రజలను తక్షణ తరలింపులో ఇవి సహాయపడతాయని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. పౌరవిమానయానశాఖ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలు ఈ ప్రతిపాదనపై చర్చించాయి.
ముఖ్యంగా మారుమూల మరియు కొండ ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి, హెలికాప్టర్ల వినియోగాన్ని పెంచాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.అన్ని కొత్త రహదారులు వాటి వెంట హెలిప్యాడ్‌లను కలిగి ఉండాలి, తద్వారా మౌలిక సదుపాయాలు ఉంటాయి” అని సింధియా చెప్పారు.జాతీయ రహదారులపై హెలిప్యాడ్‌లు అత్యవసర సమయంలో తక్షణమే తరలించడానికి సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.AIIMS రిషికేశ్‌లో అత్యవసర వైద్య సేవలను అందించడానికి రాబోయే కొద్ది వారాల్లో హెలికాప్టర్‌ను మోహరించడం ద్వారా ‘ప్రాజెక్ట్ సంజీవని’ అనే హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్టను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.హెలికాప్టర్ ఆసుపత్రిలో 20 నిమిషాల నోటీస్ పీరియడ్ లో ఉంటుంది
ఎటిఎఫ్ పై వ్యాట్ తగ్గించాలని 8 రాష్ట్రాలను సింధియా కోరారు.సింధియా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మరియు పంజాబ్‌తో సహా ఎనిమిది రాష్ట్రాలను టైర్-II, టైర్-III నగరాలకు విమాన కనెక్టివిటీని సులభతరం చేయడానికి ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ( ఎటిఎఫ్ )పై వ్యాట్‌ను తగ్గించాలని కోరారు. ఎటిఎఫ్ పై వ్యాట్‌ను తగ్గిస్తే ఈ ఎనిమిది రాష్ట్రాల్లో విమానాల కనెక్టివిటీని పెంచుతామని సింధియా హామీ ఇచ్చారు.