Heatwave: వాతావరణ శాఖ చల్లని కబురు.. త్వరలోనే ఎండలు తగ్గిపోతాయట..

మండుటెండలతో విసిగిపోయిన దేశ ప్రజలకు శుభవార్త! త్వరలోనే దేశవ్యాప్తంగా ఎండలు తగ్గనున్నాయి. పశ్చిమ రాజస్థాన్‌, కేరళ తప్పించి యావత్‌ దేశంలో వేసవి ఎండలు తగ్గముఖం పడుతాయని భారత వాతావరణ శాఖ గురువారం నాడు వెల్లడించింది. కాగా శుక్రవారం పశ్చిమ రాజస్థాన్‌లో వేడిగాడ్పులు వీస్తాయని యెల్లో అలర్ట్‌ జారీ చేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సైంటిస్టు సోమాసేన్‌ తెలిపారు.

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 08:14 PM IST

Heatwave: మండుటెండలతో విసిగిపోయిన దేశ ప్రజలకు శుభవార్త! త్వరలోనే దేశవ్యాప్తంగా ఎండలు తగ్గనున్నాయి. పశ్చిమ రాజస్థాన్‌, కేరళ తప్పించి యావత్‌ దేశంలో వేసవి ఎండలు తగ్గముఖం పడుతాయని భారత వాతావరణ శాఖ గురువారం నాడు వెల్లడించింది. కాగా శుక్రవారం పశ్చిమ రాజస్థాన్‌లో వేడిగాడ్పులు వీస్తాయని యెల్లో అలర్ట్‌ జారీ చేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సైంటిస్టు సోమాసేన్‌ తెలిపారు.

40 డిగ్రీల సెల్సియస్‌ దాటితే డేంజర్..(Heatwave)

బంగాళాఖాతం నుంచి బలమైన తేమ దేశవ్యాప్తంగా విస్తరించి ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాతావరణ శాఖ అంచాన ప్రకారం దేశంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోయింది. అదే కొండ ప్రాంతాల్లో కనీసం 30 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోతోంది. వాస్తవానికి చూస్తే ఎండలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటితే మానవులకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఐఎండీ తెలిపింది. గత కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా చూస్తే సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే హీట్‌వేవ్‌ చాలా ఎక్కువ ఉందని తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఒడిషా, తెలంగాణ విషయానికి వస్తే సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదైంది. గత వారం దేశంలోని 10 రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటిపోయింది. ఇటీవలే వాతావరణ శాఖ మే నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అయితే ఉత్తరాది రాష్ర్టాలతో పాటు సెంట్రల్‌ రిజియన్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎండలు క్రమంగా తగ్గుముఖం పడతాయని తెలిపింది. దేశంలోని తూర్పు, ఈశాన్యం, దక్షిణ ప్రాంతాల్లో చూస్తే ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో రికార్డుస్థాయిలో ఎండలు కాశాయి. దీంతో ప్రభుత్వం హెల్త్‌ వార్నింగ్‌లు జారీ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ రాష్ర్టాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. వాతావరణశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే గత ఏడాదితోపోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎండలు విపరీతంగా కాశాయని తెలిపింది. ఇప్పటి దాకా చూస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో కాసిన ఎండలు ఒక రికార్డు అని వాతావరణశాఖ పేర్కొంది.