Site icon Prime9

Char Dham pilgrims: 20 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య

Char Dham pilgrims

Char Dham pilgrims

Char Dham pilgrims: ఈ సీజన్‌లో చార్ ధామ్ యాత్రను సందర్శించిన యాత్రికుల సంఖ్య 20 లక్షలు దాటింది. దీనిలో కేదార్‌నాథ్ ధామ్ కు 7.13 లక్షల మంది యాత్రికులు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

40 లక్షల మంది యాత్రికుల రిజిస్ట్రేషన్..(Char Dham pilgrims)

జూన్ 4వ తేదీ వరకు 40 లక్షల మంది యాత్రికులు చార్ ధామ్ యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు.పర్యాటక శాఖ నివేదిక ప్రకారం వాతావరణం తేలికగా ఉన్నప్పుడు కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లను రోజుకు 60 వేల మందికి పైగా యాత్రికులు సందర్శిస్తున్నారు.చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 22న అక్షయ తృతీయ శుభ సందర్భంగా ప్రారంభమైంది. చార్ ధామ్ యాత్ర నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిగి ఉంటుంది. అవి గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్. గంగోత్రి మరియు యమునోత్రి భక్తుల కోసం ఏప్రిల్ 22న, అక్షయ తృతీయ నాడు తెరచుకున్నాయి. ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ ధామ్, ఏప్రిల్ 27న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు అత్యధికంగా 7.13 లక్షల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం కేదార్‌నాథ్ ధామ్ యాత్ర కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను జూన్ 15 వరకు మూసివేసింది.కేదార్‌నాథ్ ఆలయం దేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటి. ఆలయం తెరిచిన ఆరు నెలల కాలంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు.

Exit mobile version