Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? కమలనాథ్ ఒంటెద్దు పోకడే ముంచిందా ? దిగ్విజయ్ సింగ్ పైనే కాంగ్రెస్ ఆధారపడడం పొరపాటయ్యిందా ?బిజెపి సాంప్రదాయ ఓటు బ్యాంక్ చెక్కు చెదరక పోవడమేనా ? శివరాజ్ సింగ్ చౌహన్ పట్టిష్టమైన పాలనా నైపుణ్యామా ? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్ .
2018 ఎన్నికల్లో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది.కానీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగు బాటుతో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది.నాటి ముఖ్యమంత్రి కమల నాథ్ ఒంటెద్దు పోకడ తో కాంగ్రెస్ పార్టీ నాడు నేడు కూడా పెద్ద మూల్యమే చెల్లించుకుంది.ఏదిఏమైనా మధ్యప్రదేశ్ లో సింధియాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది .సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సపోర్ట్ తో కమల్ నాథ్ ఇక పక్షంగా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి ఆశని పాతంగా మారింది.జ్యోతిరాదిత్య సింధియా తనకు సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే లతో బిజెపి లో చేరడం కాంగ్రెస్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లైంది.అత్యధిక కాలం అధికారంలో ఉన్నపటికీ బిజెపి ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేఖత రాలేదు.సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తన చాకచక్యంతో పాలన కొనసాగించడం తో బిజెపి మరో సారి అధికారంలోకి తీసుకొచ్చింది.
భోపాల్ డిక్లరేషన్ ..( Madhya Pradesh Polls)
మధ్యప్రదేశ్ లో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించాయి. హిందీ హార్ట్ ల్యాండ్ గా చెప్పుకునే రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లో గెలిస్తే వచ్చే ఏడాది జరిగే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు పాజిటివ్ గా మారుతుందని ఇరు పార్టీలు అంచనా వేసాయి . ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓట్లు కీలకంగా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు వర్గాల్ని పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు పాత అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది.మధ్యప్రదేశ్ లో ఈసారి గెలుపు కోసం కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది .ఇందుకోసం తమ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీల కోసం రెండు దశాబ్దాల క్రితం తాము ప్రకటించిన చారిత్రక భోపాల్ డిక్లరేషన్ ను తెరపైకి తెచ్చింది .అయినా బిజెపి కి వున్న సాంప్రదాయ ఓటు బ్యాంక్ ముందు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వ్యూహాలు ఫలించలేదు .
కాంగ్రెస్ పార్టీ కి రాష్ట్ర మంతా ప్రభావం చూపే నాయకుడే లేకుండా పోయాడు.కమల్ నాథ్ పై చాలా అసంతృప్తి వుంది .అయినా దిగ్విజయ్ సింగ్ సపోర్ట్ తో కాంగ్రెస్ పార్టీ ని కమల్ నాథ్ లీడ్ చేస్తున్నారు.కింద స్థాయి కార్యకర్తలలో పార్టీ పై నమ్మకం పోయింది.చాలా కాలం నుంచి పార్టీ అధికారంలో లేకపోవడంతో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది .ఇదే క్రమంలో బిజెపి సాంప్రదాయ ఓటు బ్యాంక్ క్షత్రియ,జాట్ ,బ్రాహ్మణ ,వైశ్య వర్గాలు మరో సారి బిజెపికే ఓట్లు వేసినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం కూడా లేకుండా శివ రాజ్ సింగ్ జాగ్రత్త పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.మొత్తం మీద ఉత్తరాదిలో బిజెపి కి పట్టు తగ్గలేదని మరో సారి రుజువైంది.