Haryana: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం క్రీడాశాఖామంత్రి సందీప్ సింగ్‌ను తొలగించారు. ఒక మహిళా క్రీడాకారిణి అతనిపై ఆరోపణలు చేసింది. కానీ అతను ఇంకా దోషి కాదు. విచారణ సజావుగా జరిగేలా ఆయనను ఆ పదవి నుంచి తొలగించాం. విచారణ పూర్తయ్యే వరకు వేచి చూస్తాం అని సీఎం చెప్పారు.సందీప్ స్పోర్ట్స్ మినిస్ట్రీతో పాటు ప్రింటింగ్ మరియు స్టేషనరీ శాఖలను కూడా కలిగి ఉన్నాడు.
మరోవైపు సందీప్ సింగ్‌పై మహిళా కోచ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపధ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఝజ్జర్ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఖాప్ పంచాయతీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు దల్జీత్ సింగ్ మాట్లాడుతూ జనవరి 7వ తేదీలోగా మంత్రిని అరెస్టు చేయకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని పంచాయితీ హెచ్చరించనట్లు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుకుంటున్నాము. ఖాప్ ప్రభుత్వానికి జనవరి 7 వరకు సమయం ఇచ్చింది. హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌ను తొలగించి, అరెస్టు చేయకపోతే, మేము విస్తృతంగా నిరసన తెలుపుతామని దల్జీత్ పేర్కొన్నట్లు తెలిపారు.