Site icon Prime9

Rishab Pant : రిషబ్ పంత్ ని కాపాడిన రియల్ హీరోలు వీళ్ళే…

haryana government officials honoured suseel for saving rishab pant

haryana government officials honoured suseel for saving rishab pant

Rishab Pant : క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో పంత్ తీవ్ర గాయాలతో ప్రాణాలను దక్కించుకోగలిగాడు. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్‌ ప్రయాణిస్తోన్న కారు మంటల్లో చిక్కుకుంది. అయితే అటుగా వెళుతున్న హర్యానా రోడ్‌వేస్ బస్సు డ్రైవర్, మిగిలిన సిబ్బంది అతన్ని కాలిపోతున్న కారు నుండి బయటకు తీశారు. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. కాగా పంత్ ప్రాణాలను కాపాడిన బస్‌ డ్రైవర్, కండక్టర్లను హర్యానా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సన్మానించింది.

ప్రమాదాన్ని గమనించిన హర్యానా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్ సుశీల్ కుమార్ పంత్‌పై వెంటనే దుప్పటి కప్పి, కారు నుంచి దూరంగా తీసుకెళ్లాడు. అంబులెన్స్‌ వచ్చిన వెంటనే కండక్టర్ పరమజీత్‌ సహాయంతో పంత్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గోల్డెన్‌ అవర్‌లో రిషబ్ పంత్ ఆస్పత్రికి తీసుకొచ్చిన డ్రైవర్‌, కండక్టర్లకు సమరిటన్‌ స్కీమ్‌ కింద అధికారులు వారిని ఘనంగా సత్కరించారు. ఇద్దరికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో పాటు ఒక్కొక్కరికి రూ. 5వేల నజరానా అందించినట్లు తెలుస్తుంది. రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిన కారును సుశీల్ కుమార్ చూశారని, ఆ తర్వాత తన కండక్టర్‌తో కలిసి ఆగి సహాయం కోసం పరిగెత్తాడని ఆయన చెప్పారు. డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ మానవత్వానికి నిదర్శనంగా నిలిచారని అధికారులు పేర్కొన్నారు.

కారు అద్దాలు పగుటగొట్టి రిషబ్ పంత్ ను తానే అందులో నుంచి బయటకు లాగానని సుశీల్ మీడియాకు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన రిషబ్ పంత్ తాను ఎవరన్న విషయాన్ని చెప్పాడని సుశీల్ చెప్పారు. రిషబ్ పంత్ ప్రమాదానికి గురైన తర్వాత కుంటుతూ కనపడ్డాడని ఆయన అన్నారు. కారుకి మంటలు అంటుకుని, చెలరేగాయని చెప్పారు. పంత్ తల, వీపు, కాళ్లపై గాయాలయ్యాయని… అయితే అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పంత్ కు అయ్యే వైద్య ఖర్చు అంతా ఉత్తరాఖండ్ ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు. ఇప్పటికే ఆయన ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. బీసీసీఐ కూడా పంత్ ఆరోగ్యం గురించి పర్యవేక్షిస్తుంది. మరోవైపు యాక్సిడెంట్ సమయంలో పంత్ డబ్బులు కాజేశారంటూ వస్తున్న వార్తలను ఫేక్ న్యూస్ గా పరిగణించారు.

Exit mobile version