Site icon Prime9

Haridwar: ప్రమాదకర స్థాయికి చేరుకున్న గంగానది.. హరిద్వార్ కు హై అలర్ట్

Haridwar

Haridwar

 Haridwar:భారీ వర్షాల నేపధ్యంలో గంగా నది ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భీమ్‌గోడ బ్యారేజీ యొక్క ఒక గేటు దెబ్బతింది. దీనితో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.హర్ కి పౌరి ఘాట్ సమీపంలోని భీమ్‌గోడ బ్యారేజీ యొక్క స్లూయిస్ గేట్ దెబ్బతినడంతో హరిద్వార్‌లోని గంగలో నీటి మట్టం ఆదివారం హెచ్చరిక స్థాయి 293 మీటర్లకు చేరుకుంది. అధికారులు హై అలర్ట్ జారీ చేసి, దిగువన ఉండే  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.. ( Haridwar)

జిల్లా విపత్తు నిర్వహణ అధికారి బ్రిజేష్ భట్ మాట్లాడుతూ శ్రీనగర్‌లోని జివికె డ్యామ్ ప్రాజెక్ట్ కంపెనీ నుండి నీటిని విడుదల చేయడం వల్ల అలకనందతో పాటు గంగా నది నీటిమట్టం పెరిగిందని తెలిపారు.గంగా నది దేవప్రయాగ్‌లో 20 మీటర్లు, రుషికేశ్‌కు చేరుకునే సమయానికి 10 మీటర్లు పెరిగింది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై నదీ తీరాలకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది అని తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ అలర్ట్..

భారత వాతావారణ శాఖ (ఐఎండి) హిమాచల్ ప్రదేశ్ కు రాబోయే రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో ఈరోజు వర్షం కురవడంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పలు ప్రాంతాలు నీటిలో మునగడం, ఇళ్లు కూలిపోవడం, ట్రాఫిక్ స్తంభించకపోవడం జరిగిపోయింది.

హిమాచల్ ప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డేటా ప్రకారం, జూన్ 24 నుండి ఈ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి 117 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 12 మంది తప్పిపోగా 121 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో 53 కొండచరియలు విరిగిపడిన సంఘటనలు నమోదయ్యాయి.

Exit mobile version