Site icon Prime9

Gyanvapi petitioner: చనిపోవడానికి అనుమతించండి.. రాష్ట్రపతికి మాజీ జ్ఞాన్‌వాపి పిటిషనర్ లేఖ

Gyanvapi Mosque

Gyanvapi Mosque

Gyanvapi petitioner: వారణాసి జ్ఞాన్‌వాపి మసీదు కేసు నుండి ఉపసంహరించుకున్న కొద్ది రోజుల తర్వాత, రాఖీ సింగ్ బుధవారం నాడు, మిగిలిన నలుగురు వ్యాజ్యదారుల నుండి వేధింపులను పేర్కొంటూ అనాయాస మరణానికి  తన అభ్యర్థనను మన్నించవలసిందిగా రాష్ట్రపతిని కోరింది.

జూన్ 9 వరకు చూస్తాను..(Gyanvapi petitioner)

జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో హిందూ ప్రార్థనలు మరియు ఆచారాలు నిర్వహించడానికి అనుమతించాలని డిమాండ్ చేసిన ఐదుగురు మహిళా పిటిషనర్లలో సింగ్ ఒకరు.మిగతా నలుగురు పిటిషనర్ల నుంచి తనకు ఎదురైన వేధింపులను వివరంగా చెబుతూ, జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటలలోపు రాష్ట్రపతి నుంచి సమాధానం ఇవ్వాలని రాఖీ లేఖ రాసింది.నేను మీ ప్రత్యుత్తరం కోసం జూన్ 9, 2023 ఉదయం 9:00 గంటల వరకు వేచి ఉంటాను. మీ నుంచి నాకు ఎలాంటి స్పందన రాకపోతే, ఆ తర్వాత నేను నా అబీష్టం మేరకు నిర్నయం తీసుకుంటానని అని హిందీలో ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది.

మా కుటుంబం పరువు తీస్తున్నారు..

నలుగురు పిటిషనర్లు హిందూ సమాజంలో తన మరియు తన మొత్తం కుటుంబం పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె లేఖలో ఆరోపించారు. మే 2022లో, పై వ్యక్తులు వారి తప్పుడు ప్రచారంలో భాగంగా నాపై ఒక పుకారు వ్యాప్తి చేసారు. రాఖీ సింగ్ కేసు నుండి ఉపసంహరించుకుంటున్నట్లు వారు చెప్పారు, అయితే నేను లేదా మా మామ జితేంద్ర సింగ్ విసేన్ జీ అలాంటి ప్రకటన ఏదీ ఇవ్వలేదుఅని ఆమె రాసింది.ఈ గందరగోళం కారణంగా మొత్తం హిందూ సమాజం నాకు మరియు నా కుటుంబానికి వ్యతిరేకంగా మారింది. ప్రభుత్వం మరియు పరిపాలన నుండి చాలా మంది కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారని ఇది తనను, తన మామ ఇద్దరినీ మానసిక ఒత్తిడికి గురి చేసిందని చెప్పింది.”దీని కారణంగా నేను తీవ్రంగా బాధపడ్డాను. అందువల్ల, మీరు నాకు నొప్పిలేకుండా మరణించడానికి అనుమతిని మంజూరు చేయాలని మరియు ఈ అపారమైన మానసిక బాధ మరియు వేదన నుండి విముక్తి పొందేందుకు మార్గం సుగమం చేయాలని అభ్యర్థిస్తున్నానంటూ లేఖలో పేర్కొంది.ఈ కేసులో ప్రధాన హిందూ పిటిషనర్లలో ఒకరైన రాఖీ సింగ్ మేనమామ జితేంద్ర సింగ్ విసేన్, వేధింపులకు గురిచేస్తూ తన కుటుంబం కేసు నుండి వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించారు.

Exit mobile version