Site icon Prime9

Gautam Singhania: గౌతమ్‌ సింఘానియా విడాకుల ప్రకటన.. 1,500 కోట్లు కోల్పోయిన రేమాండ్‌

Gautam Singhania

Gautam Singhania

Gautam Singhania:రేమాండ్‌ సీఎండి గౌతమ్‌ సింఘానియా భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే రేమాండ్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లో గణనీయంగా తగ్గముఖం పట్టడం మొదలయ్యాయి. వరుసగా ఏడవ రోజుకూడా రేమాండ్‌ షేర్లు నేల చూపులు చూశాయి. భార్య నవాజ్ మోదీ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. దీంతో వెంటనే వారు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకొని బయటపడుతున్నారు.

ఆస్తిలో 75 శాతం వాటా డిమాండ్ ..(Gautam Singhania)

కాగా నవంబర్‌ 13న గౌతమ్‌ సింఘానియా తన భార్య నవాజ్‌ సింఘానియాతో విడిపోతున్నట్లు ప్రకటించగానే రేమాండ్‌ షేరు ధర 12 శాతం కుంగింది.అక్టోబర్‌ 25 నుంచి షేరు గణనీయంగా క్షీణిస్తూ వస్తోంది.మొత్తానికి రేమాండ్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 1,500 కోట్లు ఆవిరైంది. బుధవారం నాడు కూడా రేమాండ్‌ షేరు 4.4 శాతం క్షీణించింది. ఇదిలా ఉండగా రేమాండ్‌ కంపెనీ విలువ 11వేల 668 కోట్లుగా లెక్కగట్టారు. తనకు ఆస్తిలో 75 శాతం వాటా ఇస్తేనే విడాకులకు అంగీకారం తెలుపుతానని నవాజ్‌ మోదీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇలాఉండగా నవాజ్‌ మోదీ గౌతమ్‌ సింఘానియా పై సంచలన అరోపణలు చేసారు. గౌతమ్‌ తనను శారీరకంగా హింసించాడని, ఆ సమయంలో అంబానీలు వచ్చి కాపాడారంటూ జాతీయ మీడియాకు వెల్లడించారు. అలాగే తనను దీపావళి పార్టీకి అనుమతించకపోవడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం మా మైనర్‌ కుమార్తెపై, నాపై గౌతమ్ మొట్టమొదటిసారి 15 నిమిషాల పాటు కనికరం లేకుండా కొట్టారు. సెప్టెంబర్ 9న ఆయన పుట్టినరోజు వేడుక తర్వాత తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. మా ఇద్దరు కుమార్తెలు, వారి స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు. ఆయన మాపై దాడి చేసి, అకస్మాత్తుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన గన్‌ లేక ఇతర ఆయుధాలు తేవడానికి వెళ్లాడని నాకు అనిపించింది. దాంతో వెంటనే నా కుమార్తె ప్రాణాలు కాపాడేందుకు ఒక గదిలోకి తీసుకెళ్లి లాక్‌ చేశానంటూ నవాజ్‌ వివరించారు. నేను, నా కుమార్తె ఒకరిని ఒకరం కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేశాం. అప్పుడే నేను నా స్నేహితురాలు అనన్య గోయెంకాకు ఫోన్‌ చేశాను. అప్పటికే పోలీసులు మా ఇంటికి రాకుండా గౌతమ్ మేనేజ్‌ చేశాడని అనన్యకు అర్థమైంది. దాంతో ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్తానని చెప్పింది. మరోపక్క నా కుమార్తె తన స్నేహితుడు విశ్వరూప్ -సింఘానియా సమీప బంధువు కు ఫోన్‌ చేసి పెద్దవాళ్లని తీసుకురమ్మని చెప్పింది. అతడు నా కుమార్తెలిద్దరికీ స్నేహితుడు. అతడికి మా కుటుంబ పరిస్థితి తెలుసు. అదే సమయంలో నీతా అంబానీ, అనంత్ అంబానీ నాతో ఫోన్‌లో మాట్లాడారు. వారి కుటుంబం మొత్తం రంగంలోకి దిగింది. మరోవైపు పోలీసులు మీకు సాయం చేయరని తన తండ్రి బెదిరించడంతో నా కుమార్తె తీవ్ర ఆందోళనకు గురైందన్నారు నవాజ్‌. వాస్తవానికి పోలీసులు రాకుండా గౌతమ్‌ అడ్డుకున్నాడు. కానీ అంబానీలు రంగంలోకి దిగి పోలీసులు మా వద్దకు వచ్చేలా చేశారు అని ఆమె వివరించారు.

Exit mobile version